Wayanad Lok Sabha by-election
Wayanad Lok Sabha by-election : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్‌లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేశారు. రాయబరేలీ నుంచి కూడా పోటీ చేశారు. రెండింటిలో గెలవడంతో ఒకదానిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకున్నారు. అయితే ఈ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు మరో అగ్రనేత ప్రియాంకగాంధీ. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానం చేయి జారకుండా ఉండాలన్న లక్ష్యంతో హస్తం పెద్దరు ప్రియాంకను బరిలోకి దించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని భావించింది. ఈ ›క్రమంలో నవ్య హరిదాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది.
ఎవరీ హరిదాస్..
వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజ నేత ప్రియాంకగాంధీ బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకపై బీజేపీ అధిష్టానం నవ్య హరిదాస్(36)ను బరిలో దించాలని నిర్ణయించింది. కాలికట్ యూనివర్సిటీలోఇ కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ 2007లో పూర్తి చేసింది. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్ నుంచిరెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇత తన ఫేజ్‌బుక్ పేజీలో తనను తాను బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పేర్కొన్నారు.
జీరో క్రిమినల్ కేసు..
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ప్రకారం నవ్య హరిదాస్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యహరిదాస్‌కు రూ.1,28,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయి. మొత్తం రూ..1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
నవంబర్ 13న పోలింగ్..
ఇదిలా ఉంటే వయనాడ్ ఉప ఎన్నికలు నవంబర 13న జరుగనున్నాయి. వనంబర్ 23న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్ పాలక్కాడ్ పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Navya haridas is contesting as a bjp candidate in the wayanad lok sabha by election
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com