https://oktelugu.com/

Russia Ukraine War: ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?

Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు మరింత పెరుగుతోంది. నెల రోజులుగా భీకర దాడులతో రెచ్చగొడుతోంది. ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి ముమ్మరంగా రష్యా ముందుకెళ్తోంది. రష్యా చర్యలతో యావత్ ప్రపంచమే బాధ్యత వహించాల్సి వస్తోంది. దీనికి ముగింపు పలకాలని భావించి నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. తగిన ఆర్థిక సాయంతోపాటు సైనిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. రష్యా బెదిరింపులను తిప్పి కొట్టాలని భావిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ కు కూడా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2022 / 10:02 AM IST
    Follow us on

    Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దూకుడు మరింత పెరుగుతోంది. నెల రోజులుగా భీకర దాడులతో రెచ్చగొడుతోంది. ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి ముమ్మరంగా రష్యా ముందుకెళ్తోంది. రష్యా చర్యలతో యావత్ ప్రపంచమే బాధ్యత వహించాల్సి వస్తోంది. దీనికి ముగింపు పలకాలని భావించి నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. తగిన ఆర్థిక సాయంతోపాటు సైనిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. రష్యా బెదిరింపులను తిప్పి కొట్టాలని భావిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ కు కూడా నైతిక బలం పెరిగినట్లు అవుతోంది. అమెరికా కూడా సైనిక, ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

    Russia Ukraine War

    మాస్కో పై ఎన్ని ఆంక్షలు విధించినా పుతిన్ లెక్కచేయడం లేదు. దీంతో దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలని నాటో దేశాలు చూస్తున్నాయి. తూర్పు దేశాలన్ని ఒకే వేదికపై నిలిచి ఉక్రెయిన్ కు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా 40 వేల మందితో నాటో రెస్పాన్స్ ఫోర్స్ దళాలను మోహరించాయని తెలుస్తోంది. దీంతో రష్యాను నిలువరించాలని అన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఉక్రెయిన్ ను కాపాడాలని నిశ్చయించుకున్నాయి.

    Also Read:  థియేట‌ర్ లో ర‌చ్చ చేసిన ఉపాస‌న‌.. ఫ్యాన్స్‌పై పేప‌ర్లు చ‌ల్లుతూ హంగామా..

    ఉక్రెయిన్ పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నాయి. అయినా పుతిన్ మాత్రం వాటిని లెక్కచేయడం లేదు. యుద్ధమే ప్రధానంగా ముందుకు కదులుతున్నారు. ఎన్ని దేశాలు చెప్పినా తమకేమి సంబంధం లేదన్నట్లు ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. నాటో సభ్య దేశాలతోపాటు పాశ్చాత్య దేశాల సహకారం కూడా తీసుకుంటున్నాయి.

    యుద్ధ ప్రభావంతో కుదేలైపోతున్న ఉక్రెయిన్ ను ఆదుకోవడానికి అమెరికా ముందుకొచ్చింది. ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. మరోవైపు లక్షమంది ఉక్రెయిన్ శరణార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 320 మిలియన్ నిధులతో యూరోపియన్ డెమెక్రటిక్ రెసెలియన్స్ ఇనిషియేటివ్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

    Russia Ukraine War

    ఉక్రెయిన్ పై యుద్ధంతో చుట్టుపక్కల దేశాల్లో కూడా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. దీంతో రష్యాపై విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. కానీ పుతిన్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ విషయంలో రష్యా దూకుడు తగ్గించుకుని చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నా వినడం లేదు. దీంతోనే సమస్య మరింత జఠిలం అవుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా వినతులు వచ్చినా నిర్లక్ష్యమే ఆయన సమాధానంగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్ లో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక వైపు నాటో మరోవైపు రష్యా ఎవరికి వారే తమ పంతం నెరవేర్చుకోవాలని చూస్తున్నందున పరిస్థితి ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు.

    Also Read: ఐపీఎల్ మ్యాచులే టార్గెట్‌గా ఉగ్ర‌దాడి..? క్రికెట‌ర్ల‌లో భ‌యాందోళ‌న..!

     

    Tags