Homeఎంటర్టైన్మెంట్Upasana- RRR Movie: థియేట‌ర్ లో ర‌చ్చ చేసిన ఉపాస‌న‌.. ఫ్యాన్స్‌పై పేప‌ర్లు చ‌ల్లుతూ హంగామా..

Upasana- RRR Movie: థియేట‌ర్ లో ర‌చ్చ చేసిన ఉపాస‌న‌.. ఫ్యాన్స్‌పై పేప‌ర్లు చ‌ల్లుతూ హంగామా..

Upasana RRR Movie: గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరిని మాట్లాడించినా ఒక‌టే టాక్ వినిపిస్తోంది. సౌత్ నుంచి నార్త్ దాకా.. ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా త్రిబుల్ ఆర్ మేనియానే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా సినీ ప్రేక్షకుల ఎదురు చూపులకు ఈరోజు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ జాతర షురూ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది.

Upasana RRR Movie
Upasana RRR Movie

థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ అరుపులు కేకలు, డ్యాన్సులు, పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటు సామాన్య జనమే కాకుండా అటు సినీ సెలబ్రిటీలు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. జక్కన్న తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ వండర్ విజువల్స్ ను చూసేందుకు సర్వత్రా ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నో ఏళ్ల‌ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా కావడంతో.. ఆటోమేటిక్ గా హైప్ ఏర్పడింది.

Also Read:  హైకోర్టు తీర్పు స‌రైంది కాదు.. జ‌గ‌న్ చిక్కుల్లో ప‌డ‌క త‌ప్ప‌దా..?

పైగా బాహుబలి తర్వాత రాజమౌళి అంతకు మించిన బడ్జెట్ తో ఎమోషనల్ డ్రామాగా మూవీని తెరకెక్కించారు. దీంతో సెలబ్రిటీలు కూడా మూవీ చూడటానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా మూవీ చూడటానికి థియేటర్ కు వెళ్ళింది. ఆమె సినిమాను చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. అరుపులు, కేకలతో హోరెత్తించింది. థియేటర్ లో అరుస్తున్న ఫ్యాన్స్ పై పేపర్లు చింపి విసిరేసింది.

Upasana RRR Movie
Upasana RRR Movie

ఇక నాటు నాటు సాంగ్ వచ్చినప్పుడు అయితే ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా కొందరు వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయగా.. విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ వస్తోంది. రాజమౌళి విజువల్ వండర్ ను చూపించారని, సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలిని మించి రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందంటూ చెబుతున్నారు.

Also Read: RRR Movie Special Story: ఆర్ఆర్ఆర్ మూవీ జర్నీ ఎలా మొదలైంది?

 

Upasana Full Hungama At RRR Movie Benefit Show With Ram Charan At Hyderabad | NTR | Daily Culture

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version