China Taiwan War: తైవాన్ చుట్టూ ఉచ్చు బిగించిన చైనా.. మరో యుద్ధం తప్పదా?

ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన లై తైవాన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని, రెండు పక్షాలు ఒకదానికొకటి లొంగవని సోమవారం (మే 20)న ప్రమాణ స్వీకార ప్రసంగంలో ప్రతిజ్ఞ చేశారు.

Written By: Neelambaram, Updated On : May 24, 2024 4:34 pm

China Taiwan War

Follow us on

China Taiwan War: తైవాన్.. తనకు తాను స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకున్న దేశం. వాస్తవానికి ఈ ద్వీప దేశం చైనా అంతర్భాగంలోనిదని చైనా వాదిస్తోంది. ఏళ్లుగా చైనా చెరలో ఉన్న తమను చైనా పట్టించుకోకపోవడంతో స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించుకున్నామని తైవాన్ తెలుపుకుంది. గతలో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో చైనా తైవాన్ పై కూడా వార్ కు దినే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఉక్రెయిన్ వేరు.. తైవాన్ వేరు. ఉక్రెయిన్ భూభాగంగా ఉంటే తైవాన్ ద్వీప దేశం. ఇటీవల తైవాన్ కు అధినేతగా లై చింగ్-టెను బీజింగ్ ఎన్నికయ్యారు. అయితే ఆయనను చైనా ప్రమాధకరమైన విభజన కారుడని విమర్శించింది. ద్వీప దేశం తైవాన్ చుట్టూ చైనా నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలను చేపట్టింది.

చైనా ఈ విన్యాసాలు ఎందుకు చేస్తోంది?
1949 నుంచి తైవాన్ స్వయంపాలనలో ఉంది. చైనా ప్రధాన భూభాగంలో అంతర్యుద్ధంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) చేతిలో ఓడిపోయిన జాతీయ వాదులు తర్వాత ద్వీపానికి పారిపోయారు. అయితే తైవాన్ తనలో భాగమని బీజింగ్ (చైనా రాజధాని) చెప్పుకుంటూ వస్తోంది. లై మాత్రం మాది స్వంతంత్ర దేశమని చెప్పుకుంటూ వస్తున్నాడు. తమకు మద్దతివ్వాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాడు.

ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైన లై తైవాన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని, రెండు పక్షాలు ఒకదానికొకటి లొంగవని సోమవారం (మే 20)న ప్రమాణ స్వీకార ప్రసంగంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రసంగాన్ని ‘స్వాతంత్ర్యాన్ని ఒప్పుకోవడం’గా అభివర్ణించిన చైనా, ‘ప్రతిచర్యలు’ తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే యుద్ధ విన్యాసాలను చేపట్టినట్లు చైనా గురువారం పేర్కొంది.

లై ప్రసంగానికి ముందే..
అయితే అధ్యక్ష ప్రసంగానికంటే ముందే ఇలాంటివి చైనా ప్లాన్ చేసుకుందని తైపీకి చెందిన భద్రతా విశ్లేషకుడు జె మైఖేల్ కోల్ అన్నారు. లై ఏం చెప్పినా వినబోమని బీజింగ్ ఎప్పుడో నిర్ణయించుకుందని ఆయన ఇంటర్నేషనల్ వార్తా సంస్థతో అన్నారు. ఆగస్ట్, 2022లో అప్పటి యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ ద్వీపాన్ని సందర్శించిన సమయంలో చైనా ఇలాంటి విన్యాసాలను చేసింది అని ఆయన చెప్పారు.

చైనా ఏం చెప్పాలనుకుంటుంది?
ఈ విన్యాసాలు తైవాన్ కు, దాని మిత్రదేశాలకు ఒక సందేశం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘లై చైనా విషయంలో స్వరాన్ని తగ్గించడం, చైనా అనుకూల వైఖరికి తిరిగి రాకపోతే తైవాన్ పై ఒత్తిడిని కొనసాగుతుందని, ఇది లై, వాషింగ్టన్ రెండింటికీ హెచ్చరిక’ అని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ కు చెందిన అమండా హ్సియావో అన్నారు.

తైవాన్ భూభాగంను దిగ్బంధం చేయడం.. బాహ్య దళాల సాయుధ జోక్యాన్ని ఆపడం, తైవాన్ సమస్యను పరిష్కరించే సామర్థ్యం తమకు ఉందని నిరూపించాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) భావిస్తోందని విశ్లేషకుడు, మాజీ చైనా సైనిక అధికారి సాంగ్ జోంగ్పింగ్ ఇంటర్నేషనల్ ప్రెస్ కు తెలిపారు.

ఏది ఏమైనా గతంలో (2022) కంటే ఈ సారి విన్యాసాలను చైనా పెంచిందని, ఇది ముమ్మాటికి చైనా వ్యతిరేక దేశాలు తైవాన్, వాషింగ్టన్ లాంటి వాటికి హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు.

తర్వాత ఇదే జరగనుందా?
భవిష్యత్ ను మనం ఎప్పుడూ అంచనా వేయలేం.. కానీ ఊహించవచ్చు. బీజింగ్ తైవాన్ విషయంలో ఏం చేస్తుందన్న ప్రశ్నకు విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే. 2022లో పెలోసీ పర్యటన తర్వాత మాదిరిగా యుద్ధ విన్యాసాలను పొడిగించవచ్చు. లేదా తైవాన్ సమీపంలో క్షిపణులను ప్రయోగించడం వచ్చు. ద్వీపంను దిగ్భందం చేయవచ్చు. ఇవి జరగవచ్చు.. జరగకపోవచ్చు అని ఆయా దేశాలు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.