సంచలన వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సస్పెన్షన్

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్ధిషియన్ డాక్టర్ కె. సుధాకర రావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 1:58 pm
Follow us on

నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి ఎనస్ధిషియన్ డాక్టర్ కె. సుధాకర రావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం లేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.

సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ సుధాకర రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపైనా, వివిధ శాఖల ఉన్నతాధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మంగళవారం పత్రికల్లో రావడం, వార్తా ఛానెళ్లలో ప్రసారం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు మంగళవారం ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి విచారణ జరిపారు. మరోవైపు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్‌ చేసిన ఆరోపణలను ప్రతిపక్ష టీడీపీ కుట్ర అంటూ విమర్శించారు. డాక్టర్‌ సుధాకర్‌ మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చే ముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లివచ్చినట్టు చెబుతూ, ఇందుకు సంబంధించిన వీడియాను తన ట్యాబ్‌లో ప్రదర్శించారు.