Modi Red Fort Surgical Strike 2025: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండా ఎగరవేశారు. ప్రధానమంత్రి హోదాలో జాతీయ జెండాను ఎగరవేయడం ఇది 12వసారి. గతంలో ఏ ప్రధానమంత్రి సాధించని ఘనతను నరేంద్ర మోడీ తన పేరు మీద లిఖించుకున్నారు.. గత స్వాతంత్ర వేడుకల్లో తమ ప్రభుత్వం ఏం చేసిందో.. ఏం చేయబోతుందో నరేంద్ర మోడీ చెప్పేవారు. కానీ ఈసారి స్వాతంత్ర వేడుకల్లో పాకిస్తాన్ ను ఉతికి ఆరేశారు. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపించారు. కొద్దిరోజులుగా దేశంలో ఓటు చోరీ అంటూ హడావిడి చేస్తున్న రాహుల్ కు చురకలు అంటించారు.
“ఉగ్రవాదానికి సహకరించే వారికి గట్టి సమాధానం చెబుతాం. మన సైన్యానికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చాం. న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదు. ఎవరో హెచ్చరిస్తే వణికిపోయేది లేదు. దేశ సౌభాగ్యం కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు.. మన దేశం జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టేది లేదు. దాయాది దేశం మనల్ని కవ్విస్తే.. వారి దేశంలోకి వెళ్లి.. ఉగ్రవాదులను మట్టుపెట్టాం. రక్తం, నీళ్లు ఎప్పుడూ కలిసి ప్రవహించవు. డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశ రాజ్యాంగం అమలు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు. సింధు నది మీద భారతదేశానికి పూర్తిస్థాయిలో హక్కులు ఉన్నాయి. ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇచ్చే వారిని వేరువేరుగా చూడము.. డాలర్ల మీద, పౌండ్ల మీద భారతదేశం ఆధారపడదు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వీయ సమృద్ధి సాధించామని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
Also Read: చనిపోయిన వారితో చాయ్ తాగిన రాహుల్ గాంధీ!
“కొంతమంది వ్యక్తులు మన దేశ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు. మన దేశ వ్యవస్థలను ప్రపంచ వేదికల మీద విమర్శిస్తున్నారు. ఇటువంటి విధానాలను భారత్ చూస్తూ ఊరుకోదు. దేశ ఔన్నత్యాన్ని.. దేశ సౌభాగ్యాన్ని కాపాడే బాధ్యతను మేం తీసుకున్నాం. ఆదే దిశగా అడుగులు వేస్తాం. అంతేతప్ప అడ్డగోలుగా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టుగానే ఈ దేశ ప్రజలు సమాధానం చెబుతారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడే రోజుల పోయాయి. భారత్ హితం కోసం ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటాం. ఒక పట్లగా వెనుకంజ వేసే రోజులు కావు ఇవి. ఈ దేశం కోసం ఏం చేయాలో మాకు తెలుసు. ఈ దేశం కోసం ఎలాంటి అడుగులు వేయాలో కూడా మాకు తెలుసు అని” నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు..