Pulivendula Result Effect: కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా రాజకీయాలు ఉండేవి. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండేవారు ఎన్నడు కూడా శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు. కుప్పం జోలికి వైయస్ రాజశేఖర్ రెడ్డి వెళ్లలేదు. పులివెందుల జోలికి చంద్రబాబు వెళ్లలేదు. ప్రతి ఎన్నికల్లోనూ వారి వారి పార్టీల తరుపున అభ్యర్థులు ఉండేవారు .. అంతే తప్ప మీసాలు మెలేస్తూ.. తొడలు కొట్టుకునేవారు కాదు.
ఇప్పుడు వైఎస్ లేడు.. ఏదో వైసిపి పార్టీ చిహ్నంలో కనిపిస్తున్నాడు. వైయస్ తరఫున జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు పార్టీలో పెత్తనం మొత్తం కూడా బాబు కుమారుడి దే. ఒకరకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనధికారికంగా ముఖ్యమంత్రి.. ఆ రెండు మండలాలలో జరిగిన పోటీని లోకేష్ – జగన్ మధ్య జరిగినట్టుగానే చూడాలి.. పులివెందుల ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు అనేవి లేవు. ప్రతి సందర్భంలో యునానిమస్. ఎప్పుడైతే కుప్పంలోకి జగన్ ప్రవేశించాడో.. అప్పుడే లోకేష్ కూడా పులివెందులపై కాన్సన్ట్రేషన్ చేశాడు.. 2024 ఎన్నికల్లో కడపను కొట్టాడు. అదే ఊపులో ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలను గెలుచుకున్నాడు. సాధారణంగా చూస్తే ఈ రెండు జెడ్పిటిసి స్థానాలు పెద్దగా లెక్కలోకి రావు. పైగా ఈ రెండు స్థానాల్లో జరిగినవి ఉప ఎన్నికలు. కాకపోతే జగన్ సొంత జిల్లా కావడం.. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో టిడిపి సవాల్ గా తీసుకుంది. అంతేకాదు జగన్ కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది.
Also Read: ఒక వేలు మీరు చూపిస్తే నాలుగు వేళ్ళు మీవైపే చూపిస్తున్నాయి రాహుల్ గాంధీ
కుప్పంలో వేలు పెడితే కుదరదు.. ఏకంగా మేము మీ ఇంటికి వచ్చాం.. మీ నట్టింటికి వచ్చాం.. ఇక చూసుకో మీ ప్రతాపం మా ప్రతాపం అన్నట్టుగా.. టిడిపి సవాల్ విసిరింది. విసిరిన సవాల్ కు తగ్గట్టుగానే ఫలితాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి రాత్రికి రాత్రి అరెస్టు అయ్యారో.. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జెడ్పిటిసి ఉప ఎన్నికల ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. చంద్రబాబు మహా అయితే ఇంకా ఎన్నిరోజులు బతుకుతారు అని వ్యాఖ్యలు చేశారో.. అవన్నీ కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ఎన్నికల్లో నైతికత ఉందా? వ్యవస్థలను ప్రభుత్వం ఉపయోగించుకోలేదా? పోలీసులు వైసీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేయలేదా? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పలేనంత కఠినమైనవి కావు. కాకపోతే ఇప్పుడు లోకేష్ హవా నడుస్తోంది. దానికి సెంటర్ సపోర్ట్ కూడా ఉంది.. కుప్పం జోలికి జగన్ వెళ్లకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వాన్ని అనధికారికంగా నడిపిస్తున్న లోకేష్ ఒకప్పటి లోకేష్ కాదు. అతడు కూడా రాటు తేలాడు. ఢీ అంటే ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి జగన్ మీద పై చేయి సాధించాడు. చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ ఫలితం ఏపీ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో..