Narendra Modi : నరేంద్ర దామోదర్ దాస్ మోదీ(Narendra damodar das Modi).. ఈ పేరు వినగానే కేంద్రంలో బీజేపీ సర్కార్ గుర్తుకు వస్తుంది. గుర్తుండిపోతుంది. అంతలా దేశంలో పార్టీని బలోపేతం చేశారు మోదీ. మోదీ,షా ద్వయం కేంద్రంతోపాటు రాష్ట్రాల్లోనూ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్(Congres) పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. దీంతో మోదీ అంటే బీజేపీ.. బీజేపీ అంటే మోదీ అన్నట్లుగా మారింది. వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టి.. పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు మోదీ. భారత ప్రధానమంత్రిగా ఆయన మూడవసారి 2024 జూన్ 9న ప్రమాణస్వీకారం చేశారు. అయితే, గతంలో భారతీయ జనతా పార్టీ (BJP)లో 75 ఏళ్లు దాటిన నాయకులు రాజకీయ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే అలిఖిత నియమం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మోదీ 2025, సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు నిండుతాయి. కాబట్టి, ఆయన రిటైర్ అవుతారా అనే ప్రశ్న వివిధ రాజకీయ వర్గాల్లో తలెత్తింది.
Also Read : 35 ఏళ్లకే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా నియామకం.. ఇంతకీ ఎవరిమే
గత ఎన్నికల సమయంలోనూ..
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kegriwal) మోదీ 75 ఏళ్ల వయసులో రిటైర్ అయి, అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వాదనను BJP నాయకులు, ముఖ్యంగా అమిత్ షా, తోసిపుచ్చారు. షా మాట్లాడుతూ, BJP రాజ్యాంగంలో 75 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించి ఎటువంటి నిబంధన లేదని, మోదీ తన పదవీకాలం పూర్తి చేసి, భవిష్యత్తులోనూ దేశాన్ని నడిపిస్తారని స్పష్టం చేశారు.
తాజాగా సంజయ్‌రౌత్..
ఇక తాజాగా శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నాగ్‌పూర్‌లోని RSS ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, తన రిటైర్మెంట్ గురించి ప్రకటించారని, ఆయన స్థానంలో మహారాష్ట్ర నుంచి కొత్త నాయకుడిని RSS ఎన్నుకుంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఖండించారు. మోదీ 2029 వరకు ప్రధానమంత్రిగా కొనసాగుతారని, ఆయన స్థానంలో వారసుడి గురించి చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు.
బీజేపీ మౌనం..
ఇదిలా ఉంటే.. దేశ రాజకీయాలో ప్రస్తుతం మోదీ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది. మోదీ ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి రావడం కూడా ఇందుకు కారణం. అయితే మోదీ రిటైర్మెంట్ ప్రచారంపై ఇటు బీజేపీ అధిష్టానం గానీ, అటు ఆర్‌ఎస్‌ఎస్ గానీ స్పందించడం లేదు. మౌనంగా పరిణామాలను గమనిస్తున్నాయి. దీంతో ప్రచారం మరింత ఊపందుకుంది. కొన్ని పత్రికలు కూడా మోదీ సెప్టెంబర్ 16న రాజీనామా చేస్తారని కథనాలు ప్రచురిస్తున్నాయి.
భారత రాజ్యాంగం ప్రకారం, ప్రధానమంత్రి పదవికి గరిష్ట వయోపరిమితి అనేది నిర్దేశించబడలేదు. కాబట్టి, మోదీ రిటైర్మెంట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం మరియు BJP, RSS ల రాజకీయ డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి, మోదీ తన పదవీకాలం కొనసాగిస్తారని ఆఒ్క నాయకత్వం స్పష్టం చేస్తోంది.
Also Read : శాంతి కోసం ప్రయత్నిస్తే శత్రుత్వమే. నమ్మక ద్రోహమే ఎదురైంది.. పాకిస్తాన్ పై మోదీ కీలక వ్యాఖ్యలు! .