Vundavalli Aruna Kumar: ఏపీలో జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)పని అయిపోయిందా? వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవదా? అసలు ఉనికికే ప్రమాదమా? మాజీ ఎంపీ ఉండవెల్లి విశ్లేషణలో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. రెండు రోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని.. జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదని తేల్చేశారు. అయితే కూటమికి ఉన్న అనుకూలతలు, వ్యతిరేకతలు ఏవని ప్రశ్నిస్తే ఉండవల్లి నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. తనకు అంత సబ్జెక్ట్ లేదని ఆయన తేల్చి చెప్పడం విశేషం. తద్వారా కూటమి ప్రభుత్వంపై ఏడాదిలో ఎటువంటి వ్యతిరేకత లేదని సంకేతాలు ఇచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. దీంతో ఉండవల్లి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి అనుకూల వ్యక్తులు ట్రోల్ చేస్తున్నారు.
Also Read: పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!
* మహానేతకు విధేయత..
వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్( undavalli Arun Kumar ) వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయత కలిగిన నేత. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉండవల్లి అరుణ్ కుమార్. రెండుసార్లు రాజమండ్రి ఎంపీ కూడా అయ్యారు. ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఎంపీ అయినానని కృతజ్ఞతగా చెబుతుంటారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట వెళ్లలేదు. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి సైతం దూరమయ్యారు. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుడిగా మారిపోయారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ చేస్తుంటారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవితవ్యం పై తేల్చేశారు.
* గతానికి భిన్నంగా..
సాధారణంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ విశ్లేషణలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party) అనుకూలంగా ఉంటాయన్న విమర్శ ఉంది. స్నేహితుడి కుమారుడు కావడంతో ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా విశ్లేషిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. కానీ తాజా ఇంటర్వ్యూలు ఆయన నేరుగా, స్పష్టంగా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదని తేల్చేశారు. అసలు పోటీలో ఉండరని కూడా క్లియర్ కట్ గా చెప్పడం సంచలనంగా మారింది. ఉండవల్లి అరుణ్ కుమార్ నోటి నుంచి ఆ మాటలు వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం ఆందోళనతో ఉన్నాయి. అయితే అంతకుమించి ఎక్కువగా మాట్లాడలేకపోయారు ఉండవల్లి అరుణ్ కుమార్.
* కూటమికి అంతా సానుకూలం..
అయితే కూటమి ( Alliance ) ఏడాది పాలనలో ఒక వ్యూహం ప్రకారం ముందుకేల్తోందని అర్థమైంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిలిచిపోయిన పనులను కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, మౌలిక వసతుల కల్పన, ఇతరత్రా అభివృద్ధి పనులు వంటివి రాష్ట్ర ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది. గత ఐదేళ్లుగా విపరీతమైన సంక్షేమాన్ని అమలు చేసినా ప్రజలు తిరస్కరించారు. ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు అర్థమయింది. ఇప్పుడు అదే మాదిరిగా పాలన అందిస్తోంది కూటమి. బహుశా ఈ లెక్క కట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.