Narendra Modi: దక్షిణాదిలో పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇన్నాళ్లుగా ఉత్తరాదిలోనే తన ప్రభావం చూపుతున్న కాషాయ పార్టీ ప్రస్తుతం దక్షిణాదిలో కూడా బలోపేతం కావాలని చూస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాంతాల నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక స్టేట్లలో పార్టీని ప్రభావితం చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు సాధించిన బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది స్టేట్లలో తనదైన ముద్ర వేస్తున్న బీజేపీని దక్షిణాదిలో కూడా బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేస్తున్నారు.
తెలుగు స్టేట్లలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పట్టుకోల్పోతున్న నేపథ్యంలో ఇక్కడ పాగా వేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చెబుతోంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని సూచిస్తోంది. అయితే టీడీపీతో పొత్తు లేదని వారి మాటల్లో తెలుస్తోంది. దీంతో ఏపీలో టీడీపీ ఆశలు గల్లంతైనట్లేనని భావిస్తున్నారు. పీఎం మోడీ టీడీపీ పొత్తుపై సానుకూలంగా లేనట్లు సమాచారం.
Also Read: Gen Naravane: భారత సర్వసైన్యాధ్యక్షుడిగా నరవణె.. కేంద్రం నిర్ణయం
భవిష్యత్ వ్యూహాలపై నేతలు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని చెబుతున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి దక్షిణాది స్టేట్లలో పాగా వేయాలని భావిస్తోంది. దీని కోసమే అన్ని మార్గాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని యోచిస్తోంది.
Also Read: Investigative Journlism : పరిశోధనాత్మక పాత్రికేయం అంతరించలేదు.. యాజమాన్యాలే చంపేశాయ్ సార్?