https://oktelugu.com/

Allu Arjun: ఆ అవమానం బన్నీలో మార్పుకి కారణమైంది !

Allu Arjun:  తెలుగు స్టార్ హీరోలకు సినిమా మీడియా ప్రతినిధులకు ఓ ప్రత్యేక బంధం ఉంది. అందుకే, మన హీరోలందరికీ ప్రెస్ మీట్ లు అంటే చులకన. మనం లేటుగా వెళ్లినప్పటికీ, అలాగే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకపోయినప్పటికీ.. మన మీడియా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అని హీరోల అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే మీడియా జనాలు కూడా అతిగా తగ్గి ఉంటారు. హీరోగారు వీరుడు, సూరుడు అంటూ ఓవర్ గా పొగుడుతూ మొత్తానికి హీరోలు […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 06:01 PM IST
    Follow us on

    Allu Arjun:  తెలుగు స్టార్ హీరోలకు సినిమా మీడియా ప్రతినిధులకు ఓ ప్రత్యేక బంధం ఉంది. అందుకే, మన హీరోలందరికీ ప్రెస్ మీట్ లు అంటే చులకన. మనం లేటుగా వెళ్లినప్పటికీ, అలాగే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకపోయినప్పటికీ.. మన మీడియా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అని హీరోల అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే మీడియా జనాలు కూడా అతిగా తగ్గి ఉంటారు.

    Allu Arjun

    హీరోగారు వీరుడు, సూరుడు అంటూ ఓవర్ గా పొగుడుతూ మొత్తానికి హీరోలు ప్రత్యేక వ్యక్తులుగా చూస్తారు. చూపిస్తారు. అయితే, తెలుగు మీడియాతో ఉన్నట్టు.. అన్ని చోట్ల మీడియా ప్రతినిధులు ఉంటారని అనుకోవడం పొరపాటే. అలా అనుకోవడం కారణంగా క‌న్న‌డ‌నాట అల్లు అర్జున్ కి బలమైన చేదు అనుభ‌వం ఎదురైంది. పుష్ఫ పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఆ స్థాయిలోనే రిలీజ్ కావాలి కాబట్టి.. ప్ర‌మోష‌న్స్ ను కూడా భారీగానే చేస్తున్నారు.

    అందులో భాగంగా బ‌న్నీ కూడా క‌న్న‌డ సీమ‌లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధ‌వారం జరిగిన ప్రెస్ మీట్ కి బ‌న్నీ రెండు గంట‌లు ఆల‌స్యంగా వెళ్ళాడు. వెళ్ళాక, బన్నీ స్టైల్ గా అటు ఇటు చూసి.. ఒక చేయిని మీడియా వారి వైపు చూపించి కూర్చున్నాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న మీడియా వాళ్ళు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.

    Also Read: Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” అభిమానులకు స్వీట్ న్యూస్ ఇచ్చిన తెలంగాణ సర్కారు…

    ‘అల్లు అర్జున్ గారు మీరు మూడు గంటల పాటు ఆల‌స్యంగా వ‌చ్చారు. అయినా, మేము అందరం మీ కోసం ఎదురు చూశాం. అయితే, మీరు వచ్చారు. కానీ, క‌నీసం మాకు సారీ కూడా చెప్ప‌కుండా స్టైల్ గా వచ్చి చేతులు ఊపుతున్నారు. ఇదేం పద్దతి ?’ అంటూ బన్నీని నిలదీశారు. అయితే, ఆ ప్రశ్నలకు బన్నీ షాక్ అయ్యాడనే చెప్పాలి.

    పైకి లేచి మీడియాకు సారీ చెప్పి.. పొగ‌మంచు వ‌ల్ల స్పెష‌ల్ ఫ్లైట్ ఆల‌స్య‌మైంద‌ని ఏదో కవర్ చేశాడు గానీ, ఆ సంఘటన బన్నీని బాగా బాధ పెట్టిందట. అందుకే, బన్నీ ఇక నుంచి ఇలాంటి విషయాలను ముందే జాగ్రత్తగా చూసుకోవాలని తన టీమ్ కి చెప్పాడట. మొత్తానికి ఒక అవమానం బన్నీలో మార్పుకి కారణం అయింది అన్నమాట.

    Also Read: Harihara Veeramallu Movie: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి జాక్వెలిన్ ఔట్… ఆమె స్థానంలో ఎవరంటే

    Tags