Pushpa Movie: ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బన్నీ నటించిన పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు పుష్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల 30 వ తేదీ వరకు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నిర్ణయం పట్ల అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో… ఈ మూవీ నిర్మాణ సంస్థకు భారీగానే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: ‘అలవైకుంఠపురంలో’ మొదటి రోజు కలెక్షన్‌ను ‘పుష్ప’ ఎందుకు అధిగమించలేకపోయింది?
ఇక ఏపీలోనూ ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో పుష్ప సినిమా విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తమిళనాడులో 280 థియేటర్లలో.. కేరళ 200, ఆంధ్ర, తెలంగాణ కలిపి 1150, కర్ణాటకలో 140పైగా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు బాలీవుడ్లో 600కుపైగా థియేటర్లను బుక్చేసుకుంది పుష్ప. ఓవర్సీస్లోనూ 600కుపైగా థియేటర్లను లాక్చేసి..దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లకు పైగా పుష్పరాజ్ సందడి చేససేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే కన్నడ నటుడు ధనుంజయ, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !