https://oktelugu.com/

Narendra Modi: అగ్రారాజ్యాల అధినేత‌ల‌ను దాటేసిన మోడీ.. ప్ర‌పంచంలో ఆయ‌న ర్యాంకు ఎంతంటే…?

Narendra Modi: మ‌న దేశంలో రెండింటికే ఆద‌ర‌ణ ఉంటుంది. ఒక‌టి క్రికెట్‌, రెండోది సినిమా. ఈ రెండింటిలో రాణించే వారికే జ‌నాల్లో ఫాలోయింగ్ ఉంటుంది. కానీ రాజ‌కీయాల్లో ఎంత పెద్ద లీడ‌ర్ అయినా స‌రే వీరికి ఉన్నంత ఇమేజ్ ఉండ‌దు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ ఇప్పుడు ఓ పేరు సినిమా, క్రికెట్ సెల‌బ్రిటీల‌ను వెన‌క్కు నెట్టి మ‌రీ సెల‌బ్రిటీ హోదాను ద‌క్కించుకుంటోంది. ఆ పేరే ఇప్పుడు ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో గుర్తుకు […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 16, 2021 / 12:29 PM IST
    Follow us on

    Narendra Modi: మ‌న దేశంలో రెండింటికే ఆద‌ర‌ణ ఉంటుంది. ఒక‌టి క్రికెట్‌, రెండోది సినిమా. ఈ రెండింటిలో రాణించే వారికే జ‌నాల్లో ఫాలోయింగ్ ఉంటుంది. కానీ రాజ‌కీయాల్లో ఎంత పెద్ద లీడ‌ర్ అయినా స‌రే వీరికి ఉన్నంత ఇమేజ్ ఉండ‌దు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ ఇప్పుడు ఓ పేరు సినిమా, క్రికెట్ సెల‌బ్రిటీల‌ను వెన‌క్కు నెట్టి మ‌రీ సెల‌బ్రిటీ హోదాను ద‌క్కించుకుంటోంది. ఆ పేరే ఇప్పుడు ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంత‌కీ ఆయ‌నెవ‌రో గుర్తుకు వ‌చ్చారా.. ఆయ‌నే నండి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.

    Narendra Modi

    ఆయ‌న ఇమేజ్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని మ‌న దేశం వైపు చూసేలా చేస్తోంది. మ‌న దేశంలో రెండోసారి వ‌రుస‌గా గెలిచిన పీఎం అయ్యారు. మొద‌టి సారి కంటే రెండోసారి భారీ మెజార్టీతో గెల‌వ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక్క‌డ ఓ విష‌యం ఏంటంటే.. ప్ర‌జా వ్య‌తిరేక‌త పెరిగితే ఆయ‌న ఇమేజ్ త‌గ్గాలి కానీ మోడీ క్రేజ్ మాత్రం అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. ఈ క్రేజ్ పెర‌గ‌డం కేవ‌లం ఇండియాకే ప‌రిమితం కాలేదండోయ్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది.

    ఈ ఏడాదికి యువ్‌గవ్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఆద‌ర‌ణ క‌లిగిన పురుషుల లిస్టు తీస్తే.. అందులో మోదీకి 8 స్థానం దక్కింది. 20 మంది లిస్టు విడుద‌ల చేయ‌గా.. అందులో 8వ స్థానంలో మోడీ ఉన్నారు. అయితే మ‌రో విష‌యం ఏంటంటే.. యూఎస్ అధ్య‌క్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే చైనాలో గ్రేట్ బిజినెస్ మ్యాన్ జాక్ మా అలాగే ఇమ్రాన్‌ ఖాన్ లాంటి వారు కూడా మోడీ త‌ర్వాతే ఉన్నారు. ఇక అంద‌రికంటే మొద‌టి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు.

    వ‌రుస‌గా రెండోసారి కూడా ఆయ‌న ఈ జాబితాలో మొద‌టి స్థానంలో ఉన్నారు. ఇక రెండో ప్లేస్ లో ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తిగా వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచారు ఒబామా. మైక్రోసాఫ్ట్ అధ్య‌క్షుడు బిల్ గేట్స్ ఉన్నారు. మూడో స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిలిచారు. నాలుగో ప్లేస్ లో క్రిస్టియానో ​​రొనాల్డో ఉన్నార‌. ఐదో ప్లేస్ లో జాకీ చాన్, ఆరో ర్యాంకులో ఎలాన్ మస్క్ ఉన్నారు. ఇక ఏడో ప్లేస్ లో లియోనెల్ మెస్సీ ఉండ‌గా… వీరి త‌ర్వాత ఎనిమిదో ప్లేస్ లో ప్రధాని మోదీ నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక మోడీ త‌ర్వాతి స్థానాల్లో పుతిన్‌, జాక్ మా ఉన్నారు.

    Also Read: PM Modi: తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన ప్రధాని మోడీ.. 2024 ఎన్నికలే టార్గెట్

    ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న స్థానం 8 అయితే.. ఇండియాలో ఆయ‌నే నెంబ‌ర్ 1. ఇక ఇండియా నుంచి ఈ జాబితాలో నలుగురికి స్థానం దక్కింది. ఇందులో సచిన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌, విరాట్ కోహ్లి ఉన్నారు. 18వ స్థానంలో నిలిచారు.

    Also Read: Vijay Diwas: విజయ్ దివస్-1971 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు.. ఆరోజు ఏం జరిగిందంటే..?

    Tags