https://oktelugu.com/

Kohli vs Ganguly: కోహ్లీ వర్సెస్ గంగూలీ.. పరస్పర విరుద్ధ ప్రకటనలు?

Kohli vs Ganguly: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య తలెత్తిన చిన్న వివాదం అభిమానుల్లో అగ్గిరాజేస్తోంది. టీ20 నుంచి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ హుందాగా తప్పుకోగా వన్డే కెప్టెన్ గా మాత్రం అతడిని బీసీసీఐ తప్పించడం వివాదానికి కారణమైంది. ఈ పరిణామాన్ని కోహ్లీ తీవ్ర అవమానంగా భావించడంతో ఈ ఇష్యూ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య అగాథాన్ని సృష్టిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం అనేక మలుపు తిరుగుతుండటంతో క్రికెట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2021 / 12:39 PM IST
    Follow us on

    Kohli vs Ganguly: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య తలెత్తిన చిన్న వివాదం అభిమానుల్లో అగ్గిరాజేస్తోంది. టీ20 నుంచి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ హుందాగా తప్పుకోగా వన్డే కెప్టెన్ గా మాత్రం అతడిని బీసీసీఐ తప్పించడం వివాదానికి కారణమైంది. ఈ పరిణామాన్ని కోహ్లీ తీవ్ర అవమానంగా భావించడంతో ఈ ఇష్యూ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య అగాథాన్ని సృష్టిస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం అనేక మలుపు తిరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

    Kohli vs Ganguly

    వన్డే కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తప్పించే విషయంలో బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ వివాదానికి బీసీసీఐనే కారణమని అందువల్లే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీనే దీనిపై స్పందించి పుల్ స్టాప్ పెట్టాలనే డిమాండ్స్ అభిమానుల నుంచి విన్పిస్తున్నాయి. ఈక్రమంలోనే వన్డే కెప్టెన్ గా తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ ఇటీవల మీడియా ముఖంగా మాట్లాడుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.

    వన్డే జట్టు కెప్టెన్ గా తనకు తాను తప్పుకోలేదని బోర్డే తప్పించిదనే విషయాన్ని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విబేధాలు చెప్పాడు. రోహిత్ జట్టును సమర్ధవంతంగా నడిపించగలగడని కితాబిచ్చారు. అలాగే తాను వన్డే జట్టులో ఆడటం లేదనే వార్తలను సైతం ఖండించాడు. తాను దక్షిఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే మ్యాచులను సైతం ఆడుతానని స్పష్టం చేశాడు.

    అయితే తనను బీసీసీఐ ఉన్నఫలంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని మాత్రం తప్పుబట్టాడు. గతంలో తాను టీ20 కెప్టెన్ నుంచి తప్పుకున్నప్పుడు కూడా బోర్డు సరిగా స్పందించలేదన్నాడు. కేవలం గంటన్నర ముందు మాత్రమే తనను వన్డే కెప్టెన్ గా తప్పించారనే విషయాన్ని కోహ్లీ మీడియా ముఖంగా వెల్లడించడం సంచలనంగా మారింది.

    కోహ్లీ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియా ముఖంగా స్పందించారు. అసలేం జరిగిందనే విషయాలపై గంగూలీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకుంటానని చెప్పినప్పుడు తామంత వద్దని వారించినట్లు చెప్పారు. అయితే కోహ్లీ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని చెప్పారు.

    ఇక దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదని సెలక్షన్ కమిటీ భావించిందని తెలిపారు. వారి నిర్ణయం మేరకు వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను ప్రకటించడం జరిగిందని గంగూలీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కోహ్లీకి ముందుగానే వెల్లడించినట్లు గంగూలీ చెప్పారు.

    Also Read: టీమిండియాలో ఆధిపత్యపోరుకు ముగింపు పలికేదెవరు?

    అయితే కోహ్లీ, గంగూలీ వ్యాఖ్యలకు ఎక్కడ కూడా పొంతన కుదరడం లేదు. దీంతో వీరిలో ఎవరి మాటలను నమ్మాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా బోర్డుకు, విరాట్ కోహ్లీకి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈనేపథ్యంలోనే బోర్డు పెద్దలు సంయమనం పాటిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

    లేకుంటే ఈ వివాదం ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతిస్తుందని చెబుతున్నారు. ఇది జట్టుకు మరింత ప్రమాదకమని క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనలో టీంఇండియా ఎలా ఆడుతుందనే చర్చ సైతం జోరుగా నడుస్తోంది. మరోవైపు ఈ వివాదానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందనే ఉత్కంఠత నెలకొంది.

    Also Read: మళ్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ఫస్ట్ మ్యాచ్.. ఈసారి ఏం జరుగనుంది?