Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో కరోనా ముప్పును తొలగించుకునేందుకు అందరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

కరోనా ప్రభావం దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, కేరళ స్టేట్లు రెండు వారాలు సెలవు ప్రకటించాయి. కానీ ఏపీ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కరోనా ప్రభావం తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత పది రోజుల్లో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. కానీ ఏపీ మాత్రం పాఠశాలలు యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 2023లో ‘పవర్’ ప్లేయర్ ఎవరు?
హైదరాబాద్ లో పలు పార్టీల నేతలు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. కరోనా రక్కసి విజృంభిస్తున్న తరుణంలో జాగ్రత్తలుతీసుకుంటున్నా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుసుకోవడం లేదు.
అయితే ప్రతి ఏటా సంక్రాంతికి తమ సొంతూరు నారా వారి పల్లెకు వెళ్లే చంద్రబాబు కుటుంబం ఈసారి హైదరాబాద్ లోనే ఉంది. దీంతో లోకేష్ కరోనా బారిన పడటంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ర్టంలో కరోనా కల్లోలం పెరగడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కరోనా ముప్పును తుద ముట్టించాలంటే ఏం చర్యలు తీసుకుంటారో కూడా చెప్పడం లేదు. ఏదిఏమైనా కరోనాను రూపు మాపే చర్యలకు ప్రభుత్వం ఎప్పుడు ఉపక్రమిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: ప్రపంచం మీదకు ప్రాణాలు తీసే మరో మహమ్మారి ‘డెల్టాక్రాన్’