జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: లోకేష్

జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం అని తెలుగు దేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. సిఎం జగన్ మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు, మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకమని ట్వీట్ చేశారు. గత ఏడాది కంటే రూ.30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 5:41 pm
Follow us on


జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలు, రైతులు, డాక్టర్లు, ఉద్యోగస్తులు పై లేకపోవడం బాధాకరం అని తెలుగు దేశం పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. సిఎం జగన్ మీ ఇంటికొస్తే ఎం ఇస్తారు, మా ఇంటికొస్తే ఎం తెస్తారు అనే రకమని ట్వీట్ చేశారు.

గత ఏడాది కంటే రూ.30 వేల కోట్లు అధిక ఆదాయం ఉన్నా డాక్టర్ల కు ఇచ్చే మాస్కులు, ఉద్యోగస్తుల జీతాల నుండి ప్రజలకు అందించే సహాయం వరకూ కోతలు పెడుతున్నారని తెలిపారు. మరోవైపు కాంట్రాక్టర్ల కు బిల్లుల రూపంలో చెల్లించిన రూ. 6,400 కోట్లు ఆకాశం నుండి ఊడిపడ్డాయా అని ప్రశ్నించారు.

కరోనా నేపథ్యంలో కేంద్రం చేస్తున్న సహాయం తాను చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఏమి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 5 కేజీలు ఉచిత బియ్యం, ఒక కేజీ కందిపప్పు ఇప్పటివరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయలేదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 16 రకాల నిత్యావసరాలు ఉచితంగా ఇస్తున్నారని, సర్వం కోల్పోయిన ప్రజలకు కొన్ని రాష్ట్రాల్లో రూ. 5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. జగన్ గారు మాత్రం బీద అరుపులతో సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారు.