కరోనాపై పోరుకు హలీవుడ్ సూపర్ స్టార్ విరాళం

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలకు కరోనా పాకింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. కరోనాపై పోరాటానికి పలువురు ధనవంతులు, సెలబెట్రీలు, దాతృత్వం ఉన్నవారు సాయమందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా పోరాటానికి తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ చేరారు. కండల వీరుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచారు. 1.43 మిలియన్ల డాలర్ల […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 4:58 pm
Follow us on


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా(కోవిడ్-19) ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలకు కరోనా పాకింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలాడిపోతున్నాయి. ఇండియాలో కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. కరోనాపై పోరాటానికి పలువురు ధనవంతులు, సెలబెట్రీలు, దాతృత్వం ఉన్నవారు సాయమందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

కరోనా పోరాటానికి తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ చేరారు. కండల వీరుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కరోనాపై పోరాటానికి మద్దతుగా నిలిచారు. 1.43 మిలియన్ల డాలర్ల భారీ విరాళంగా అందజేశారు. అదేవిధంగా 50వేల మాస్కులను కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న వైద్యులకు ఆర్నాల్డ్ సమకూర్చారు. ఆర్నాల్డ్ సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కండల వీరుడు ఆర్నాల్డ్ పలు యాక్షన్ మూవీల్లో నటించి మెప్పించారు. ప్రజలకు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు.. నేను ఇంట్లో కూర్చోలేనని.. నాకు చాతనైన సహాయం చేయాలనుకుంటానని ఆర్నాల్డ్ ప్రకటించాడు. ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో పోరాడుతున్న రియల్ హీరోలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తనవంతు బాధ్యతగా సాయం చేసేందుకు విరాళం ఇవ్వడం గొప్ప మార్గమని భావిస్తున్నానని ప్రకటించారు. కరోనాపై పోరులో తాను భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానని ఆర్నాల్డ్ పేర్కొన్నారు.