https://oktelugu.com/

Nara Lokesh : ట్రోల్ ఆఫ్ ది డే : ఈ మహిళ చేతిలో అడ్డంగా బుక్కైన నారా లోకేష్

Nara Lokesh : నారా లోకేష్ పబ్లిక్ మీటింగ్స్ లోకి అడుగుపెట్టి ఏదైనా మాట్లాడాడు అంటే ప్రతిపక్షాలకు పండగే.ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలను ఈయనే తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన ఇలా దొరికిపోయాడు, సోషల్ మీడియా కారణంగా ఆయనపై ట్రోల్ల్స్ దారుణంగా పడేవి,అయితే ట్రైనింగ్ తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఈమధ్య కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. వెరైటీ గా ప్రత్యర్థి పార్టీలకు మాస్ వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో ఈమధ్య ఆయన ప్రసంగాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2023 / 07:39 PM IST
    Follow us on

    Nara Lokesh : నారా లోకేష్ పబ్లిక్ మీటింగ్స్ లోకి అడుగుపెట్టి ఏదైనా మాట్లాడాడు అంటే ప్రతిపక్షాలకు పండగే.ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలను ఈయనే తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన ఇలా దొరికిపోయాడు, సోషల్ మీడియా కారణంగా ఆయనపై ట్రోల్ల్స్ దారుణంగా పడేవి,అయితే ట్రైనింగ్ తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఈమధ్య కాస్త జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. వెరైటీ గా ప్రత్యర్థి పార్టీలకు మాస్ వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో ఈమధ్య ఆయన ప్రసంగాలు ఇస్తున్నాడు.

    అయితే ఈమధ్యనే ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘యువ గళం’ పేరిట పాద యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఏ ముహూర్తం లో ఈ పాదయాత్ర ప్రారంభించాడో కానీ, ఈ యాత్ర ప్రారంభానికి విచ్చేసిన నందమూరి తారకరత్న గుండెపోటు తో మరణించాడు.సుమారుగా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకి కన్నుమూశాడు.నందమూరి అభిమానులు మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఈ విచారం నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

    కానీ నారాలోకేష్ మాత్రం తన ‘యువ గళం’ పాదయాత్ర ని కొనసాగిస్తూనే ఉన్నాడు, మరోపక్క చంద్ర బాబు నాయుడు కూడా విస్తృతంగా సభలు నిర్వహిస్తున్నాడు.ఇలా తండ్రీకొడుకులు ప్రజాక్షేత్రం లో ఉంటూ రాబొno 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం గా దూసుకుపోతున్నారు. నేటితో నారాలోకేష్ పాదయాత్ర ప్రారంభమై 35వ రోజుకు పీలేరు మండలానికి చేరుకుంది. అయితే ఈరోజు పాదయాత్రలో జరిగిన ఒక అరుదైన సంఘటన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ల్స్ కి గురి అవుతోంది.

    అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమాలో ఒక కామెడీ సన్నివేశం ఉంటుంది.’మా గుడిని పొడిచేసారు రా దేవుడా’ అని సన్నివేశం ఉంటుంది కదా, ఎవరో ఒక ఆవిడ ఆ రేంజ్ లోనే నారా లోకేష్ పాదయాత్రలో అచ్చంగా అలానే ఓవర్ యాక్షన్ చేస్తుంది. లోకేష్ ను అడ్డుకొని తన బాధనంతా పూనకం వచ్చినట్టుగా వెళ్లగక్కింది. ఆమెకి డబ్బులిచ్చి చేయించారో, లేదా నిజంగానే చేసారో తెలీదు కానీ ఆ వీడియో మాత్రం భలే ఫన్నీ గా ఉంది..మీరు కూడా చూసి నవ్వుకోండి.