
Allu Arjun Romance : అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఆయన భార్య స్నేహారెడ్డితో ఓ రొమాంటిక్ ఫోజ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నేడు ఆయన పెళ్లి రోజు నేపథ్యంలో భార్యకు తనదైన శైలిలో విషెస్ చెప్పి ప్రేమ చాటుకున్నారు. ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ అని కామెంట్ పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఆయన అభిమానులు పెళ్లి రోజులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లైక్స్ కొడుతూ షేర్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. కొందరేమో కొండగుట్టల్లో ఏకాంతంగా గడుపుతున్నారా అని కొంటె కామెంట్స్ చేస్తున్నారు.
2011 మార్చి 6న అల్లు అర్జున్-స్నేహ రెడ్డిల వివాహం జరిగింది. వీరిది లవ్ మ్యారేజ్. ఒక వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పుడు మొబైల్ నంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. మెల్లగా మాటలు కలిసి ఆపై మనసులు కలిసి పెళ్లి వరకూ వెళ్లారు. అయితే స్నేహారెడ్డి ఫాదర్ మొదట్లో అల్లు అర్జున్ కి తన కూతురిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదట. అల్లు అరవింద్ నేరుగా వెళ్లి అడిగినా నో అన్నారట. అయితే స్నేహారెడ్డి పట్టుబట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నారట.
అయితే పెళ్ళయాక మా అల్లుడు నంబర్ వన్ అని ఆయన చెప్పుకుంటున్నారు. అలాగే కట్నంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అందుకు తాము వ్యతిరేకం అన్నారట. మా అల్లుడు బన్నీ గురించి ఇండియా వైడ్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్నేహ రెడ్డి తండ్రి పేరు శేఖర్ రెడ్డి. ఆయనకు హైదరాబాద్ లో విద్యాసంస్థలు ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని తెలుస్తుంది.
అల్లు అర్జున్-స్నేహారెడ్డిలకు అమ్మాయి అబ్బాయి సంతానం. అబ్బాయి పేరు అయాన్. చిచ్చర పిడుగు అమ్మాయి పేరు అర్హ. సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం చిత్రంలో అర్హ శకుంతల కొడుకు భరతుడు పాత్ర చేసింది. శాకుంతలం టీజర్లో అర్హ లుక్ రివీల్ చేశారు. అర్హ సింహం మీద కూర్చొని రావడం… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఇక స్నేహారెడ్డి సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. స్నేహారెడ్డి గ్లామరస్ వీడియోలు, ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఆమెను ఇంస్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలో అవుతున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. విలన్ ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ షెడ్యూల్ నందు జాయిన్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ దర్శకుడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు.