ఎక్కడో ముంబైలో ఉంటాడు.. పలు టాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. ఫేమస్ విలన్ గా తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో ఫేమస్.. హిందీలోనూ పలు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో చేతికి ఎముకే లేకుండా కోట్లు ఖర్చు పెట్టి వలస కార్మికులను, విదేశాల్లో ఉన్న వారిని రప్పించి ఆదుకున్నాడు. ఈయన చేసిన సేవలకు దేశమంతా ‘సోనూ సూద్ రియల్ హీరో’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
Also Read: ‘పుష్ప’లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అదే!
ఆపదలో ఉన్నా అని ట్వీట్ చేసిన ప్రతి వారినీ సోనూసూద్ ఆదుకున్నారు. ఇక ట్విట్టర్ లో తన కంట పడిన ప్రతీ అంశంపై కూడా ఆయన స్పందించారు.
తాజాగా చిత్తూరు జిల్లా టామోటా రైతు నాగేశ్వరరావు దుస్థితిని ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు. కరోనా లాక్ డౌన్ తో పంట నష్టపోయి పెట్టుబడికి డబ్బులు లేక ఎద్దులు లేదా ట్రాక్టర్ దున్నించే తాహతు లేక కూతుళ్లతో సాగు నడిపిస్తున్న నాగేశ్వరరావు వీడియోను ఎవరో తీసి ట్విట్టర్ లో పెట్టారు. అది వైరల్ అయ్యింది.
దీన్ని చూసిన సోనూసూద్ చలించి గంటల్లోనే నాగేశ్వరరావు కుటుంబానికి ట్రాక్టర్ ను అందించాడు. ఎక్కడో ముంబైలో ఉన్నా కూడా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఓ రైతు కష్టం గుర్తించి వెంటనే స్పందించి ట్రాక్టర్ ను గంటల్లోనే అందించాడు.
Also Read: బిగ్‌బాస్4 కోసం పూనమ్ బజ్వా అంత తీసుకుంటోందా?
అయితే అంత దూరాన ఉన్న విలన్ నటుడు సోనూసూద్ కు ఆంధ్రా రైతు కష్టం అర్థమైంది.కానీ మన స్టార్లూ ఉన్నారు. పోయిన సంక్రాంతికే 200 కోట్ల బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు. తమదే అత్యధిక కలెక్షన్ అని ఊదరగొట్టే ప్రకటనలు ఇచ్చారు. కానీ తెలుగు రైతు కష్టాన్ని గుర్తించలేకపోయారు.. ఆదుకోలేకపోయారు. కలెక్షన్లు, వసూళ్లకు మాత్రమే తెలుగు జనాలు కావాలి.. కానీ వారి కష్టాలు మన స్టార్లకు పట్టవా అని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి మన సమాజాన్ని పట్టించుకోని స్టార్లను మనం ఎందుకు పట్టించుకోవాలని నినదిస్తున్నారు. టాలీవుడ్ స్టార్లూ ఇప్పటికైనా మారండని కోరుతున్నారు.