Bigg Boss: తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఆదివారం ముగిసింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను నిర్వాహకులు అత్యద్భుతంగా ప్లాన్ చేసి వెరీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు.

ఇకపోతే గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు బోలెడు మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్, హీరో రణ్ వీర్ సింగ్, జగపతి బాబు, నవీన్ చంద్ర, నిర్మాత శోభు, ‘పుష్ప’ టీమ్ రష్మిక, సుకుమార్, డీఎస్పీ, ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్ నాని, కృతిశెట్టి, సాయిపల్లవి, ‘బంగార్రాజు’ నాగచైతన్య హాజరయ్యారు. సీనియర్ హీరోయిన్ శ్రియ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది.
ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 5 విజేతను నాగార్జున స్టేజీ మీద అనౌన్స్ చేశాడు. ఇందుకుగాను ఒక్కొక్కరిని టాప్ ఫైవ్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చాడు. చివరకు వీజే సన్నీని విజేతగ ప్రకటించాడు.
వీజే సన్నీనా లేదా షణ్ముక్ జస్వంత్‌నా ఎవరు విజేతగా నిలుస్తారనేది చివరి వరకు సస్పెన్స్‌గా ఉండేది. చివరకు ఆ సస్పెన్స్‌కు తెరపడింది. కాగా, ‘బిగ్ బాస్’ టైటిట్ విన్నర్ అయ్యేది కేవలం పురుషులేనా అన్న ప్రశ్న ఎదురవుతున్నది. గత సీజన్స్‌లోనూ అబ్బాయిలే విజేతగా నిలిచారు. ఈ సారైనా అమ్మాయిలు గెలుస్తారని భావించినప్పటికీ చివరకు అబ్బాయి విజేత అయ్యారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను కేవలం గ్లామర్ షోకు ఉపయోగించారా అని పలువురు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. గ్లామర్ షో కోసం తప్ప విజేతలుగా అమ్మాయిలు ఉండరా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో సీజన్ వన్ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్ కౌశల్, మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ అభిజిత్ టైటిల్ గెలుచుకున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో లేడి కంటెస్టెంట్ లు గ్లామర్ షో కి మాత్రమేనా…
తాజాగా ఐదో సీజన్ వీజే సన్నీ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అమ్మాయిలకు టైటిల్ గెలిచే చాన్స్ ఇవ్వరా.. కేవలం గ్లామర్‌కే వాళ్లు పనికొస్తారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ సీజన్‌లో గత సీజన్స్‌తో పోల్చితే హగ్గులు, ముద్దుల డోస్ కొంచెం ఎక్కువే అయింది. అలా చేయడం స్క్రిప్టెడ్ వర్కా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sunny: ఆ నలుగురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారు?.. సన్నీ పరిస్థితి ఏమవుతుంది?