Nandamuri Fans: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వాడివేడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అంధ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే కొన్ని సంచలన నిర్ణయాలు రాష్ట్రం లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయిలో ఉన్నాయి..ఇది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి..మొన్న కోనసీమ కి అంబెడ్కర్ నామకరణం చేసి ప్రకంపనలు లేపింది ప్రభుత్వం..ఈ సంఘటన వల్ల అక్కడ ఎలాంటి అల్లర్లు జరిగాయో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు లేటెస్ట్ విజయవాడ లో ఉన్న ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తీసేసి YSR పేరు పెడుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం వల్ల తెలుగు దేశం పార్టీ నాయకులూ మరియు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు..రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నా నందమూరి కుటుంబ సభ్యులు..స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు కూడా ఈ సంఘటన పై స్పందించారు..అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ఆయన అభిమానుల్లో మరియు టీడీపీ కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చిపెట్టేలా చేసింది.

నాణ్యమైన విద్య అందించడానికి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు విజయవాడ లో ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ ని స్థాపించారు..పాతికేళ్ల నుండి ఈ విశ్వ విద్యాలయం లో చదువుకున్న ఎంతో మంది గొప్పగా చదువుకొని డాక్టర్లు అయ్యారు..అలాంటి మహోన్నత విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఎన్టీఆర్ గారి పేరు ని తొలగించి YSR పేరు పెడితే నువ్వు స్పందించే తీరు ఇదా అంటూ ఎన్టీఆర్ ని తిట్టడం ప్రారంబించారు అభిమానులు..’ YSR మరియు ఎన్టీఆర్ అశేష ప్రజాభిమానం పొందిన నాయకులూ..ఎన్టీఆర్ పేరు మార్చి YSR పేరు పెట్టినంత మాత్రాన ఎన్టీఆర్ స్థాయి తగ్గిపోదు,YSR గౌరవం పెరగదు’ అంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ నందమూరి మరియు టీడీపీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టింది..తప్పు జరుగుతున్నప్పుడు బలంగా ప్రభుత్వం ని విమర్శించే దమ్ము లేనప్పుడు ఎందుకు నీకు ఎన్టీఆర్ అనే పేరు..ఆయన పేరు పెట్టుకోవడానికి నువ్వు అర్హుడివి కాదు..ఎన్టీఆర్ ని YSR లాంటి అవినీతి పరుడితో పోలుస్తావా..అసలు నీకు ఎన్టీఆర్ చరిత్ర తెలుసా?? ఆయన గురించి తెలిసిన ఎవ్వరు కూడా ఇలా మాట్లాడారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ని దుయ్యబట్టారు..అంతే కాకుండా సొంత అన్నయ్య తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చెల్లెలు YS షర్మిల మాట్లాడింది..ఆమెకి ఉన్న ధైర్యం లో పావు శాతం కూడా నీకు లేకపోయింది అంటూ ఎన్టీఆర్ ని అభిమానులు తిడుతున్నారు..సోషల్ మీడియా మొత్తం ప్రస్తుతం ఎక్కడ చూసిన దీని గురించే చర్చ నడుస్తుంది..ఇప్పట్లో ఈ వేడి తగ్గేలా లేదు.
