https://oktelugu.com/

ప్రజావాణిని ప్రతిబింబించిన నల్లపురెడ్డి?

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోరు విప్పారు. ప్రభుత్వంపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్కారు నిర్మించి ఇస్తున్న ఇళ్లపై మీడియా సమక్షంలోనే ఆవేదన చెందారు. సీఎం జగన్ నిర్మిస్తున్న ఇళ్ల గురించి తనలోని భావ వ్యక్తీకరణను బయటపెట్టారు. ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లలో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాన్ని 30 లక్షల మందికి ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో రూ.1.80 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలని సంకల్పించారు. ఇల్లు […]

Written By: , Updated On : June 27, 2021 / 04:29 PM IST
Follow us on

Nallapareddy Prasanna Kumar Reddyవైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నోరు విప్పారు. ప్రభుత్వంపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్కారు నిర్మించి ఇస్తున్న ఇళ్లపై మీడియా సమక్షంలోనే ఆవేదన చెందారు. సీఎం జగన్ నిర్మిస్తున్న ఇళ్ల గురించి తనలోని భావ వ్యక్తీకరణను బయటపెట్టారు. ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లలో కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాన్ని 30 లక్షల మందికి ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో రూ.1.80 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలని సంకల్పించారు. ఇల్లు ఎలా ఉండాలనే దానిపై నమూనాలు సిద్ధం చేశారు. సెంటు స్థలంలో ఓ బెడ్ రూం, కిచెన్, బాత్ రూం ఉండేలా ప్లాన్ చేశారు. దీంతో నలుగురు సభ్యులు ఉండే ఇంటిలో ఇద్దరు బయట ఉంటే ఇద్దరు లోపల ఉండేలా ఉందని నల్లపురెడ్డి పేర్కొన్నారు.

300 చదరపు అడుగుల స్థలంలో అన్ని వసతులు ఉండాలంటే కష్టమే అని తెలిపారు. దీంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. వైసీపీ నేతలందరిలోను ఇదే విధమైన భావం ఉన్నా ఎవరు పెదవి విప్పడం లేదు. సందర్భం రావడంతో నల్లపురెడ్డి బయటపడ్డారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావాల్ని వ్యక్తీకరించారు.

సొంత పార్టీలోనే అధినేత మెప్పు పొందడం కోసం వెంపర్లాడే నేతలుండగా నల్లపురెడ్డి మాత్రం ప్రజాసమస్యలను ఎప్పడికప్రుడు చెప్పడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఇళ్ల విషయంపై నోరు విప్పారని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లల్లో సదుపాయాలు సరిగా లేవనే సంగతి అందరికి తెలిసినా ఎవరు ముందుకు రావడం లేదు.