Nagababu Pawan Kalyan : తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం అన్న నాగబాబు కష్టపడుతున్నారు. జనసేన పార్టీ స్తాపించినప్పటి నుంచి పవన్ వెంట ఉన్నది సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మాత్రమే. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో తన సోదరుడు నాగబాబుకు నర్సాపురం ఎంపీ సీటును ఇచ్చి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ప్రోత్సహించారు. అప్పటి నుంచి జనసేనలో నాగబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ్ముడితోపాటు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభా వేదిక నుంచి నాగబాబు యాక్టివ్ అయ్యారు. ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు మాత్రమే ప్రధాన వేదికలో ఇతర నేతల మధ్యలో ఉన్నారు. ఈ ముగ్గురే జనసేనలో ఇప్పుడు కీలకంగా ఉన్నారు. ఏ విధాన నిర్ణయాలైనా.. పార్టీ విషయాలైనా.. పర్యటనలు, బలోపేతమైనా కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు.
Also Read: Pavan Kalyan Tirupati: పవన్ కల్యాణ్ ఇక అక్కడి నుంచే పోటీ..: తీర్మానం జరిగిపోయింది..
జనసేన పార్టీ పీఏసీ సభ్యుడిగా ఇప్పుడు నాగబాబు ఉన్నారు. పవన్ కళ్యాన్ స్థానంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం ముందుడుగు వేశారు. స్వయంగా పర్యటనలు పెట్టుకున్నారు. జూన్ 1 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారు. జూన్1న శ్రీకాకుళం జిల్లా , జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటిస్తారు.
ఈ పర్యటనలో మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, జిల్లా కమిటీ నాయకులకు, నియోజకవర్గ కమిటీ నాయకులకు, ఆయా విభాగాల కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు నాగబాబు అందుబాటులో ఉంటారు.
పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి దిశానిర్ధేశం చేస్తారు. పార్టీ ఎదుగుదలకు దోహదపడే అభిప్రాయాలు స్వీకరిస్తారు. జనసేన పార్టీ సిద్ధాంతలు, విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తారు. పవన్ తర్వాత అంతటి నాగబాబు వస్తుండడంతో ఇప్పుడు వారికి స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Also Read: Lust And Love: ప్రేమకు కామానికి ఉన్న తేడా ఏంటో తెలుసా?