విజయవాడలో పెరిగిన కంటైన్మెంట్ జోన్లు..!

విజయవాడ నగరంలో కంటైన్మెంట్ జోన్ ల సంఖ్య పెరగడం అటు స్థానికుల్లో, ఇటు అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కొత్త కంటైన్మెంట్ జోన్ ల జాబితాను అధికారులు విడుదల చేశారు. 4వ విడత లాక్ డౌన్ సమయంలో 32 వార్డులే ఈ జాబితాలో ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 42 కు పెరగడం నగరంలో కరోనా కేసుల ఉధృతికి అద్ధం పడుతోంది. రోజుకు 20 నుంచి 30 కేసుల వరకూ నమోదు అవుతున్నట్లు సమాచారం. విజయవాడ నగర […]

Written By: Neelambaram, Updated On : June 10, 2020 12:06 pm
Follow us on


విజయవాడ నగరంలో కంటైన్మెంట్ జోన్ ల సంఖ్య పెరగడం అటు స్థానికుల్లో, ఇటు అధికారుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కొత్త కంటైన్మెంట్ జోన్ ల జాబితాను అధికారులు విడుదల చేశారు. 4వ విడత లాక్ డౌన్ సమయంలో 32 వార్డులే ఈ జాబితాలో ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 42 కు పెరగడం నగరంలో కరోనా కేసుల ఉధృతికి అద్ధం పడుతోంది. రోజుకు 20 నుంచి 30 కేసుల వరకూ నమోదు అవుతున్నట్లు సమాచారం. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 64 వార్డులు ఉండగా 22 వార్థులను మినహాయించి మిగిలిన 42 వార్డులని కంటైన్మెంట్ జోన్ లగా గుర్తిస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ కంటైన్మెంట్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా, కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా లక్షణాలు కలిగిన వారు, జలుబు, దగ్గు, గొంతునొప్పి మొదలగు అనారోగ్య సమస్యలు ఉన్నా ఆయా వార్డు వాలంటీర్ల కు లేక ఎ ఎన్ ఎమ్, సంబంధిత వార్డు వైద్యులను గాని సంప్రదించాలి అని అధికారులు కోరుతున్నారు. నగరంలో కంటైన్మెంట్ జోన్ వివరాలోకి వెళితే 1 నుండి 5 వార్డులు, 8 ,11 ,15 వార్డులు, 16, నుండి 22 వార్డులు, 26 నుండి 29, 32 వార్డులు, 36 నుండి 41,43,44 వార్డులు, 46 నుండి 56,58,59,63,64 వార్డులు అన్నియు కంటైన్మెంట్ ఏరియలుగా ప్రకటించారు.

మరోవైపు మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుర్గ గుడి కూడా ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉండటంతో భక్తులకు దర్శనానికి అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే దుర్గ గుడిలో దర్శనాలకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఆలయ అధికారులు ఈ అంశంపై ఇంత వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. నగరంలోని రైతు బజార్లను ప్రారంభించలేదు. కూరగాయలు, పాల విక్రయాలు ఉదయం 11 గంటల వరకే కొనసాగిస్తున్నారు.