Pawan Kalyan- Vangaveeti Ranga: ఏపీలో జనసేన అధ్యక్షుడు పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా.. సుదీర్ఘ కాలం వేచిచూస్తున్న బడుగు, బలహీనవర్గాలు, కాపు జాతికి ఇప్పుడు ఒక ఆశాకిరణంగా మారిపోయాడు. పవన్ ను భావితర నాయకుడిగా చూడడం మొదలు పెట్టారు. సరికొత్త తరహాలో రాజకీయం చేస్తుండడాన్ని ప్రజలు గుర్తించడం ప్రారంభించారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అయినా.. పేరు మోసిన నాయకులు తన వెంట లేకపోయినా.. కనీసం ఒక్క ఎమ్మెల్యే లేకున్నా.. వందలాది మంది ప్రజాప్రతినిధులున్న అధికార పార్టీని వణికిస్తున్నారంటే ఏదో తెలియని అతీతమైన శక్తి పవన్ వద్ద ఉంది. అయితే ఎంత శక్తిమంతుడైనా.. ప్రత్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఇందుకు మాస్ లీడర్ వంగవీటి మోహన్ రంగా ఉదంతమే ఒక ఉదాహరణ.

విజయవాడలో లోకల్ లీడర్ గా కేరీర్ ప్రారంభించి బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా నిలవడం, జాతీ నేతగా గుర్తింపు పొందడం.. చేసింది రెండుసార్లు ఎమ్మెల్యే పదవే అయినా రాష్ట్రాన్ని శాసించగల స్థాయికి చేరుకునే క్రమంలో మోహన్ రంగా దారుణ హత్యకు గురయ్యారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ సజీవమే. ఆయన మా వాడంటే మావాడు అని పోటీపడి కీర్తించడం వెనుక ఆయన మేనియా అటువంటిది. ఆ మహా నాయకుడు బతికి ఉంటే బడుగు, బలహీనవర్గాలు, కాపు జాతి ఎదురుచూస్తున్న రాజ్యాధికారం నాడే సాకారమయ్యేది. కాపు జాతి నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు. కానీ మోహన్ రంగాలా సమ్మోహన శక్తి ఎవరూ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోహన్ రంగా పోరాట పటిమకు దగ్గరగా ఉన్నారు. అయితే ఈ క్రమంలో పవన్ భద్రత విషయంలో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ప్రాణాలకు ప్రత్యర్థులు ముప్పు తలపెడతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరుగుతున్న పరిణామాలను జనసైనికులు గుర్తుచేస్తున్నారు. విశాఖ ఎపిసోడ్ లో పవన్ పై దాడికి వైసీపీ ప్రయత్నించిందని అనుమానిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పవన్ ఇటీవల పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విశాఖలో పవన్ పై దాడికి వైసీపీ వ్యూహం పన్నిందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి అట. కానీ వెనక్కి తగ్గితే చేతకానితనంగా చెప్పుకుంటారని భావించి పవన్ విశాఖ వెళ్లారట. అందుకే వ్యూహాత్మకంగా పవన్ హోటల్ కే పరిమితమయ్యారట. దీనికి కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల కారణమట. వైసీపీ కీలక నాయకుడి ఇంట్లో పవన్ పై దాడికి వ్యూహరచన జరిగిందట. వైసీపీ వాట్సాప్ గ్రూపులో పలానా జంక్షన్ కు చేరుకోవాలని ఆదేశాలు వచ్చాయట. కానీ పోలీసులు ముందుగానే భగ్నం చేయడం, పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో వారి పని సాగలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఓ టీవీ చానల్ డిబేట్ లో పవన్ ను రంగా మాదిరిగా హత్య చేయడానికి ప్లాన్ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు ఆందోళనకు గురయ్యారు. కానీ నాటి రంగ పరిస్థితులు వేరు.. నేటి పవన్ వేరు. పవన్ కు ఇతర పార్టీ నేతలకు లేని అతీతమైన అభిమాన శక్తి ఉంది. పైగా వ్యవస్థలో నిజాయితీ అధికారులు, ఉద్యోగుల అండ సైతం ఉంది. ప్రస్తుతం వారంతా అధికార ఒత్తిడికి గురికావొచ్చు కానీ.. భవిష్యత్ నాయకుడు పవన్ అన్న డిసైడ్ కు వచ్చారు. ఆయన్ను ప్రత్యర్థులు ఏమీ చేయలేరని స్వయంగా వారే కితాబిస్తున్నారంటే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.