Komatireddy Rajagopal: తెలంగాణలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజకీయాలలో వేడెక్కాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో హాట్‌హాట్‌గా సాగుతున్న పొలిటికల్ గేమ్‌లో ఇప్పుడు అన్ని పార్టీల చూపు మునుగోడు లనియోజకవర్గంపై పడింది. స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడి ఇందుకు కారణం. రెండేళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్ వారం రోజులుగా రాజకీయాలను రసకందాయంలో పడేశారు. తాను టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీలో చేరుతానని ఇదివరకే ప్రకటించానని, ఆ సత్తా ఇప్పుడు బీజేపీకి మాత్రమే ఉందని సంచలన ప్రకటన చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శించారు. నాటి కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగానలో లేదన్నారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడడం ఖాయమైపోయింది.
Komatireddy Rajagopal
నియోజకవర్గ నేతలతో మంతనాలు..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్న నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీని వీడుతున్నట్లు సంకేతాలను ఇచ్చారు. పార్టీని వీడాల్సిన పరిస్థితులను వివరించిన ఆయన వారి మద్దతును కోరారు. శాసనసభ సభ్యత్వంతోపాటు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్‌పై విమర్శలు కొనసాగిస్తున్నారు.
‘బండి’ గ్రీన్ సిగ్నల్..
Bandi Sanjay
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఆయనే స్వయంగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరతారని ప్రకటించారు. ఐదు రోజులుగా రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు మాత్రం వెనుకాడింది. తాజాగా బండి సంజయ్ ప్రకటనతో కాంగ్రెస్ అధిష్టానం అలర్డ్ అయింది. రాజగోపాల్‌పై చర్యలకు సిద్ధమవుతోంది. బీజేపీ గడప తొక్కక ముందే చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈమేరకు రాజగోపాల్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా అధిస్టానానికి నివేదిక సమర్పించింది.
Also Read: Naga Chaitanya Sensational Decision: ‘థాంక్యూ’ ప్లాప్ కారణంగా చైతు సంచలన నిర్ణయం !
క్యాడర్ చూపు ఎటువైపు?
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరితే తనకు మద్దతిస్తారా? అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులను అడిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో నాంపల్లి, మర్రిగూడ, చండూరు మండలాల ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కార్యకర్తల చేతుల్లోనే ఉందన్న రాజగోపాల్‌రెడ్డి… కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకే తాను బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తెలిపారు. గతేడాది పీసీసీ అధ్యక్ష పదవి అడిగినా ఇవ్వలేదని చెప్పారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడినా అధిష్ఠానం సరైన సమయంలో స్పందించలేదని తెలిపారు. ఇప్పుడు ‘నా నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు. ఉపఎన్నికలు జరిగిన నియోజకవర్గాలకు భారీగా నిధులు వస్తున్నాయి. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను రాజీనామా చేయాలి. అప్పుడు మీరంతా నా వెంట వస్తారా? నన్నెం చేయమంటారు?’ అని రాజగోపాల్‌రెడ్డి పార్టీ ముఖ్యనాయకులను అడిగినట్లు సమాచారం.
రాజగోపాల్ వెంట మరో ఇద్దరు..
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వారం రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన తన వెంట మరో ఇద్దరు సీనియన్ నాయకులను కూడా తీసుకెళ్తారని తెలిసింది. ఈమేరకు ఆయన ఇప్పటికే వారితో మంతనాలు జరిపినట్లు సమాచారం. తాజాగా బీజేపీ సీనియర్ నాయయకులు కూడా రాజగోపాల్‌రెడి వెంట వచ్చే నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన యువ నేత, ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలిసింది.
Also Read: Dinesh Karthik: డీకే, మురళీ విజయ్ చీటింగ్ లొల్లి.. మైదానంలో ఫ్యాన్స్ గోల వైరల్