Actress Sensational Comments: ఆ మంత్రి వారానికోసారి నా బెడ్ రూంకు వచ్చేవాడు: నటి సంచలన ఆరోపణలు

Actress Sensational Comments: తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అవినీ కుంభకోణంలో ఒక్కో ఆధారం బయటపడుతోంది. బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన ఘనకార్యంగా చెబుతున్నారు. కోట్లాది రూపాయలు లంచంగా తీసుకుని సంచుల నిండా డబ్బులు దాచి బయటపడిన ఉదంతం వెలుగులోకి రావడంతో ప్రభుత్వంలో వణుకు పుడుతోంది. ఇప్పుడెలా అని ఆరాటపడుతున్నారు. అవినీతి కంపు అంటుకోవడంతో భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారు. బీజేపీపై మెజార్టీతో గెలిచిన మమత ప్రభుత్వం ఇప్పుడు అవినీతి కోరల్లో చిక్కుకుంటోంది. దీనిపై […]

Written By: Neelambaram, Updated On : July 27, 2022 6:05 pm
Follow us on

Actress Sensational Comments: తీగ లాగితే డొంకంతా కదులుతోంది. అవినీ కుంభకోణంలో ఒక్కో ఆధారం బయటపడుతోంది. బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన ఘనకార్యంగా చెబుతున్నారు. కోట్లాది రూపాయలు లంచంగా తీసుకుని సంచుల నిండా డబ్బులు దాచి బయటపడిన ఉదంతం వెలుగులోకి రావడంతో ప్రభుత్వంలో వణుకు పుడుతోంది. ఇప్పుడెలా అని ఆరాటపడుతున్నారు. అవినీతి కంపు అంటుకోవడంతో భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారు. బీజేపీపై మెజార్టీతో గెలిచిన మమత ప్రభుత్వం ఇప్పుడు అవినీతి కోరల్లో చిక్కుకుంటోంది.

Mamata Banerjee

దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అగ్రనేతలకు సైతం సంబంధాలున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు రూ.21 కోట్ల కుంభకోణంలో నేతల తలరాతలు మారే అవకాశాలున్నాయి. తమ ప్రభుత్వంలో అవినీతికి చోటు లేదని గాంభీర్యం ప్రకటించిన మమతా బెనర్జీ ఇప్పుడేం చెబుతారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పార్థా చటర్జీ ఇరుక్కోవడం కలవరం కలిగిస్తోంది. పార్టీ నేతల్లో అందరికి భయం పట్టుకుంది. ఇది ఎటు తిరిగి ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. దీంతో మమత బెనర్జీ ఏం చర్యలు తీసుకుంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

Also Read: Jubilee Hills Rape Case: జూబ్లిహిల్స్ బాలిక రేప్ కేసులో కీలక మలుపు

మరోవైపు బెంగాల్ నటి అర్పితా ముఖర్జీ ఈడీకి సంచలన విషయాలు చెప్పింది. తనకు మంత్రి 2016 నుంచి తెలుసునని వెల్లడించింది. వారానికోసారి తన ఇంటికి వచ్చి డబ్బును చెక్ చేసుకుని వెళ్లిపోయే వాడని తెలిపింది. దీంతో అవినీతిలో దొరికిపో యిన మంత్రి బాగోతం కాస్త రట్టవుతోంది. రోజురోజుకు పెంటపెంటగా మారుతోంది. నిజాలు వెల్లడయ్యే కొద్ది ఆయన చుట్టు కేసు ఉచ్చు బిగుస్తోంది. ఇక తప్పించుకునే మార్గమే లేకుండా పోతోంది. దీంతో డబ్బు సంపాదనలో ఇంకా ఎవరెవరు సహకరించారో కూడా ఈడీ రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.

Arpitha Mukherjee

ఈ డబ్బంతా అవినీతి రూపంలో సంపాదించిందేనని నటి అర్పిత పేర్కొనడం గమనార్హం. దీంతో మంత్రి తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అయితే ఆయనను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసి ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చెబుతోంది. మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పాలన చేసే అధికారం మమత కోల్పోయిందని ఎద్దేవా చేస్తున్నారు.

Also Read: Naga Chaitanya Sensational Decision: ‘థాంక్యూ’ ప్లాప్ కారణంగా   చైతు సంచలన నిర్ణయం !

Tags