Kiran Rathod Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నుండి ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం రాత్రి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. దాంతో ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోయింది. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ ఘనంగా లాంచ్ అయ్యింది. అనూహ్యంగా 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్లో అడుగుపెట్టారు. నటుడు శివాజీ, నటి షకీలా, నటి కిరణ్ రాథోడ్, సీరియల్ నటుడు అమర్ దీప్, కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, నటుడు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, యూట్యూబర్ తేజా, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, రతికా రోజ్, ప్రియాంక సింగ్ హౌస్లో అడుగుపెట్టారు.
ఇక మొదటివారానికి గానూ 8 మంది నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, రతికా రోజ్, షకీలా, గౌతమ్ కృష్ణ, దామిని, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ నామినేట్ అయ్యారు. వీరిలో ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ లకు తక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో డేంజర్ జోన్లో నిలిచారు. అందరూ సేఫ్ అయ్యాక వీరిద్దరూ మిగిలారు. ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నడిచింది.
చివరిగా నాగార్జున కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మొదటివారమే ఇంటికి చెక్కేసిన కిరణ్ రాథోడ్ ఎంత సంపాదించింది? ఆమె రెమ్యూనరేషన్ ఎంత? అనే చర్చ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్ రాథోడ్ రోజుకు రూ. 45 వేలు ఒప్పందం మీద హౌస్లో అడుగుపెట్టారట. ఆ లెక్కన 7 రోజులకు గానూ రూ. 3.15 లక్షలు ఇచ్చారట. ఒకప్పటి టాప్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ అంత త్వరగా ఎలిమినేట్ అవుతుందని ఊహించలేదు.
కిరణ్ రాథోడ్ తెలుగులో పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. సూపర్ హిట్ మూవీ నువ్వు లేక నేను లేను మూవీలో తరుణ్ ఫ్రెండ్ రోల్ చేసింది. అలాగే శ్రీరామ్, నాని, చెప్పవే చిరుగాలి, అందరూ దొంగలే, భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా, హైస్కూల్ చిత్రాల్లో ఆమె నటించారు. 2016 తర్వాత బ్రేక్ తీసుకున్న కిరణ్ రాథోడ్ ప్రస్తుతం విజయ్ లియో చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.