ఛీ.. లక్షలు ఉన్న నటుడికి ప్రభుత్వ సాయమా !

ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల కోసమా.. లేక నెలకు లక్షల్లో సంపాదించే వారి కోసమా ? సీఎం కేసీఆర్ కి మత్తు ఎక్కువై మంత్రులు ఏమి చేస్తున్నారో చూసుకోవడం లేదు అనుకుంటా. అయినా సీఎం సహాయ నిధి నుండి డబ్బులు వెళ్తున్నాయి అంటే.. దానికి బాధ్యత సీఎందే కదా. మరి సీఎం కేసీఆర్ గారు ఎవరికి సాయం చేయాలో ? ఎవరికీ చేయకూడదో తెలియక సాయిలు చేస్తున్నారా ?. అసలు కనీసం ముందులు కొనుక్కోలేక చనిపోతున్న […]

Written By: admin, Updated On : March 28, 2021 6:12 pm
Follow us on


ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల కోసమా.. లేక నెలకు లక్షల్లో సంపాదించే వారి కోసమా ? సీఎం కేసీఆర్ కి మత్తు ఎక్కువై మంత్రులు ఏమి చేస్తున్నారో చూసుకోవడం లేదు అనుకుంటా. అయినా సీఎం సహాయ నిధి నుండి డబ్బులు వెళ్తున్నాయి అంటే.. దానికి బాధ్యత సీఎందే కదా. మరి సీఎం కేసీఆర్ గారు ఎవరికి సాయం చేయాలో ? ఎవరికీ చేయకూడదో తెలియక సాయిలు చేస్తున్నారా ?. అసలు కనీసం ముందులు కొనుక్కోలేక చనిపోతున్న వేలమంది ఉన్న ఈ సమాజంలో లక్షలు సంపాదన ఉన్న ఓ నటుడికి సీఎం సహాయనిధి నుండి డబ్బులు ఇస్తారా ?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌, జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ తల్లి అనారోగ్యానికి లోనైందట. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్‌ రూపంలో అందించింది. ఈ అవినాష్‌ అనే అతనికి లక్షల సంపాదన ఉంది. హైదరాబాద్ లో రెండు ప్లాట్స్ ఉన్నాయి. ఒక కారు మెయింటైన్ చేసున్నాడు. నైట్ పబ్ లకు కూడా వెళ్తుంటాడని టాక్. మరి ఇలాంటి వ్యక్తికీ సాయం అవసరమా ?

ముక్కు అవినాష్ తల్లి కాళ్ళ లక్ష్మిరాజం అనారోగ్యానికి ప్రజలు ఏమైనా బాధ్యులా ? మరి ఎందుకు ప్రజల సొమ్మును కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు దానం చేస్తున్నాడు ? అయినా తన తల్లి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు తీసుకున్న ఈ ముక్కు అవినాష్ అనే వ్యక్తికీ కనీసపు విలువులు ఉన్నాయా ? అవకాశం వస్తే డబ్బులు అడగడమేనా ? ఏ ? ఎంతమంది పేదలు లేరు, వారి కోసం ఎప్పుడైనా ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయ నిధిని ప్రకటించిందా ?

కానీ ఒక నటుడి తల్లికి బాగాలేదు అంటే.. కొప్పుల ఈశ్వర్‌ లక్ష్మీరాజం అనే మంత్రి కుమారుడు అవినాష్‌కు ప్రత్యేకంగా చెక్ను అందజేశారట. అసలు సీఎం సహాయనిధి నుండి డబ్బులు ఇచ్చే అర్హత ఈ మంత్రి కొడుక్కి ఎవ్వరు ఇచ్చారు ? సీఎం కేసీఆర్ ఇచ్చాడా ? లేక కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ ఇచ్చాడా ? పైగా ఈ ఘనకార్యం అనంతరం ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి పబ్లిసిటీ చేసుకున్నారు.

ఒక్కటి మాత్రం ఈ రోజుకి సరైన వైద్యం అందక చనిపోతున్న ప్రతి ఒక్కరి చావుకి ముందు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక సాయాలు అందించి ఉంటే గనుక.. ఎంతోమంది బతికి ఉండేవారు. కానీ గుర్తింపు, లేదా పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ఈ ప్రభుత్వం సాయం అందించేలా ఉంది. పైగా సామాన్యలకు అందాల్సిన సాయాన్ని కూడా గుర్తింపు, లేదా పలుకుబడి ఉన్నవారికి అందించడం బాధాకరమైన విషయం.