
పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఎల్ఐసీ ఎన్నో పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల కొరకు ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పాలసీలలో న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ ఒకటి. పుట్టిన పిల్లల నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీ యొక్క మెచ్యూరిటీ వయస్సు 25 సంవత్సరాలు. పిల్లలకు పాలసీ తీసుకుంటే 25 ఏళ్ల వయస్సు వరకు ఈ పాలసీకి గడువు ఉంటుంది.
కనీసం 1,00,000 రూపాయల నుంచి ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులతో పాటు పిల్లలతో రక్త సంబంధం ఉన్నవాళ్లు కూడా వారి పేర్లపై ఈ పాలసీలను తీసుకోవచ్చు. పిల్లల వయస్సును బట్టి చెల్లించాల్సిన ప్రీమియంలో మార్పులు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు లక్షల రూపాయల పాలసీకి సంవత్సరానికి రూ.4,415 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున కట్టే అవకాశాన్ని కూడా ఎల్ఐసీ కల్పిస్తూ ఉండటం గమనార్హం. రోజుకు కేవలం 12 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ పాలసీతో లక్ష రూపాయలు పొందవచ్చు. ఒకవేళ పుట్టిన పిల్లలకు 5,00,000 రూపాయలకు పాలసీ తీసుకుంటే ఏడాదికి 22,075 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
సమీపంలోని ఎల్ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ ప్రీమియం వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు. పిల్లలకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.