అంబానీ నష్టం ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు!

కరోనా దెబ్బతో రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టెకున్న వ్యాపారి దగ్గర నుండి అతి పెద్ద బడా వ్యాపారుల వరకు అందరికి నష్టం వాటిల్లింది. మహమ్మారి కరోనా రక్కసి ఇటు చిరు వ్యాపారులకు నష్టం, అటు కుబేరుల ఆస్తులను ఆవిరి చేసింది. మొన్నటి వరకు ఆసియా ధనికుడు ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితమే రెండో స్థానానికి పడిపోయారు. ఈ రెండు నెలల్లో అతని ఆస్తులు భారీగా తగ్గిపోయాయి. ఈ వైరస్ వల్ల మార్కెట్లు కుప్పకూలడం, […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 10:39 am
Follow us on

కరోనా దెబ్బతో రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టు పెట్టెకున్న వ్యాపారి దగ్గర నుండి అతి పెద్ద బడా వ్యాపారుల వరకు అందరికి నష్టం వాటిల్లింది. మహమ్మారి కరోనా రక్కసి ఇటు చిరు వ్యాపారులకు నష్టం, అటు కుబేరుల ఆస్తులను ఆవిరి చేసింది. మొన్నటి వరకు ఆసియా ధనికుడు ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితమే రెండో స్థానానికి పడిపోయారు. ఈ రెండు నెలల్లో అతని ఆస్తులు భారీగా తగ్గిపోయాయి. ఈ వైరస్ వల్ల మార్కెట్లు కుప్పకూలడం, వ్యాపారాలు నష్టపోతున్న విషయం తెలిసిందే. దీంతో ముఖేష్ అంబానీయే కాదు దేశ, అంతర్జాతీయ కుబేరుల ఆస్తులు భారీగా ఆవిరయ్యాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద, కరోనా వైరస్ కారణంగా గణనీయంగా తగ్గింది. ఆయన రోజుకు సగటున 300 మిలియన్ల డాలర్లు (రోజుకు రూ.2,200 కోట్లు) కోల్పోయారు. దీంతో కేవలం రెండు నెలల వ్యవధిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖేష్ నికర విలువ 19 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) నష్టం వాటిల్లింది.

అంతర్జాతీయంగా కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ ఎనిమిది స్థానాలు తగ్గి పదిహేడవ స్థానానికి వచ్చారు.