నేడు(ఏప్రిల్ 8) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. బన్నీ బర్త్ డే ను పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్లో విషెస్ తెలియజేశారు. బన్నీ చిన్ననాటికి ఫొటోను షేర్ చేస్తూ బన్నీతో తనకున్న అనుబంధాన్ని మెగాస్టార్ తెలియజేశారు. చిన్నతనం నుంచి బన్నీ డాన్సులోని కసి, కృషి తనకు ఇష్టమంటూ మెగాస్టార్ తెలిపారు. ‘హ్యపీ బర్త్ డే అల్లు అర్జున్.. నువ్వు బాగుండాలబ్బా’ అంటూ బన్నీ స్టైల్లోనే మెగాస్టార్ విసెస్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది.
మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ ‘గంగోత్రి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. తొలిచిత్రంతోనే అల్లు అర్జున్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆర్య’, ‘హ్యాపీడేస్’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘డీజే’ వంటి చిత్రాలతో అలరించాడు. రీసెంట్ గా ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అల్లు అర్జున్ తెలుగుతోపాటు మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింది. తెలుగులో విడుదలైన అల్లు అర్జున్ ప్రతీమూవీ కేరళ విడుదలై మంచి విజయాలు సాధించాయి.
బన్నీ-సుకుమార్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ మూవీ ఫస్టు లుక్కును బన్నీ పుట్టిన రోజు కానుకగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీ ఫస్టు లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు ఆయన సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో బన్నీ పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేసుకున్నారు.