
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. అందులోభాగంగానే విశాఖను పాలనా రాజధానిగా ఎంపిక చేశారు. విభాజిత ఏపీలో ఏకైక మెగా సిటీ విశాఖనే.. పరిపాలనా రాజధానిగా చేసేందుకు ఈ సిటీకి అన్ని అర్హతలూ ఉన్నాయి.
Also Read: ఏపీపై కేంద్రం ఫోకస్: మత మార్పిడులపై కేంద్రం సీరియస్?
ప్రస్తుతం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే విశాఖ రాజధాని కోసం ఇప్పటికే కొన్ని ముహూర్తాలు పెట్టినా టైమ్ కలసిరాక వెనక్కి తగ్గారు. అయితే ఇపుడు మరో అద్భుతమైన ముహూర్తం ఉంది. అదే అక్టోబర్ 25 విజయదశమి. ఈ ముహూర్తం సందర్భంగా విశాఖలో సచివాలయానికి భూమి పూజ చేస్తారని వైసీపీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న మాట.
పరిపాలనా రాజధాని అయిన విశాఖలో రూ.150 కోట్లతో సచివాలయం నిర్మిస్తారని అంటున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగానే దసరా పండుగ రోజున శంకుస్థాపన ఘట్టం వైభవంగా జరుగనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అవసరమైన ప్రభుత్వ భూమిని కూడా సెలెక్ట్ చేశారని టాక్. అదే కనుక జరిగితే భవన నిర్మాణం కంటే ముందే విశాఖలోని ఒక తాత్కాలిక భవనంలోకి సచివాలయం తరలివస్తుందని కూడా అంటున్నారు.
Also Read: తారల చీకటి బాగోతం: డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సెక్స్ రాకెట్?
అదే జరిగితే.. ఇక విశాఖ వాసుల ఆశలు నెరవేరినట్లే. ఇన్నాళ్లు అమరావతి రాజధానిగా అనుకున్న వారికి ఇది కన్నుకుట్టే వార్త అనే చెప్పాలి. విశాఖకు దసరా ఏ కానుక తీస్తుకువస్తుందో తెలియకుండా ఉంది. వైసీపీ నేతలు అంటున్నట్లుగానే దసరా ముహూర్తంగా సచివాలయం నిర్మాణానికి విశాఖలో పునాది రాయి పడుతుందో.. లేదో చూద్దాం మరి..!