Mughal Emperor: మొఘలులు భారత దేశాన్ని వందల ఏళ్లు పాలించారు. దేశంలో అనేక నిర్మాణాలు చేశారు. అయితే మన దేశంలో అప్పటికే ఉన్న చారిత్రక నిర్మాణాలు, ఆలయాల(Temples)ను కూల్చివేశారు. ధ్వంసం చేశారు. సంపదను దోచుకుపోయారు. భారతీయులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అనేక పన్నులు విధించి ఇబ్బందులు పెట్టారు. అయితే నాటి మొఘల్ చక్రవర్తుల వారసులు ఇప్పుడు దీనంగా జీవనం సాగిస్తున్నారు. రాజవంశీయులు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవనం సాగిస్తున్నారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్(Bahadursha Jaffar)మునిమనవరాలు సుల్తానా బేగం కోల్‌కతా శివార్లలోని హౌరాలో రెండు గదుల గుడిసెలో జీవిస్తోంది. ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిచిన వీరి వంశం ఇప్పుడు కూడుకు గతిలేని స్థితిలో ఉంది.
Also Read: బైరెడ్డి కుటుంబంలో పోరు.. తమ్ముడికి తలంటిన అక్క!
చివరి రాజు బహదూర్‌షా..
బహదూర్ షా జాఫర్ 1837లో సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1857 తిరుగుబాటు తర్వాత ఆయన రంగూన్‌కు పంపబడి, 1862లో అక్కడే మరణించాడు. సుల్తానా భర్త మీర్జా బేదార్ బుఖ్త్(Merja bhedar bikth)1980లో మరణించాక ఆమె జీవితం కష్టాల్లో పడింది. నెలకు 6 వేల రూపాయల పింఛనుతో ఆరుగురు పిల్లలను పోషిస్తోంది. ప్రభుత్వ సాయం లేక, ఆమె ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి. ఆమె కుమార్తెలు కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
సుల్తానా టీ స్టాల్, టైలరింగ్ దుకాణం పెట్టేందుకు ప్రయత్నించినా విజయం సాధించలేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నప్పటికీ, ఆమె జీవితం ఇప్పటికీ దుర్భరంగానే ఉంది. తన రాజవంశ పారంపర్యం గురించి ఆమెకు సంతోషం లేదు. కేవలం ఆహారం, ఆశ్రయం ఉంటే చాలని ఆలోచిస్తోంది.
యోగి కీలక వ్యాఖ్యలు..
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మొఘలుల వారసుల గురించి మాట్లాడారు. మొఘలుల అరాచకాల వల్ల వారి వారసులు శిక్ష అనుభవిస్తున్నారని, కోల్‌కతాలో రిక్షా తొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది నిజమని సుల్తానా జీవితం నిరూపిస్తోంది. మొఘలులు ఆలయాలపై దాడులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న వీరి వారసులు ఇప్పుడు జీవనోపాధి కోసం పోరాడుతున్నారు. సుల్తానా కథ గత వైభవానికి, ప్రస్తుత దీనస్థితికి నిదర్శనం.
Also Read: కొత్త వ్యాపారంలోకి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. పాలిటిక్స్ కు గుడ్ బై!