Byreddy Shabari: రాయలసీమలో( Rayalaseema) బైరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సాగింది ఆ కుటుంబం. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆ కుటుంబంలో చీలిక వచ్చింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమార్తె శబరి తెలుగుదేశం పార్టీలో ఉండగా.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడు. అలాగే బైరెడ్డి శబరి సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచారు. అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం మొన్నటివరకు శాప్ చైర్మన్గా కొనసాగుతూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పదవి పోయింది.
Also Read: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడా.. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి..!
* గత కొన్నేళ్లుగా సైలెంట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party ) ఓడిపోయిన తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు సిద్ధార్థ రెడ్డి. దీనిపై తాజాగా ఫైర్ అయ్యారు బైరెడ్డి శబరి. సోదరుడు సిద్ధార్థ రెడ్డికి గట్టిగానే హెచ్చరికలు పంపారు. త్వరలో అవినీతి బయటకు వస్తుందని.. శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎవరి హయాంలో కర్నూలు జిల్లా అభివృద్ధి చెందిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.
* శబరి సంచలన కామెంట్స్..
ఇటీవల పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు ఎంపీ బైరెడ్డి శబరి( Baireddy Sabari). బైరెడ్డి అంటే తానేనని.. సిద్ధార్థ రెడ్డి కానే కాదని.. కేసులు, అరెస్టుల గురించి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తనను అక్క అని చూడకుండా కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. తమ కార్యకర్తలపై కూడా దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు రాణి తన తల్లి పైన వ్యక్తిగత విమర్శలు చేయించారని కూడా మండిపడ్డారు. జగన్ తన తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడ కూడా అదే చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో వ్యూస్ రాలేదని.. సిద్ధార్థ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఎంపీ శబరి మండిపడ్డారు. 9 నెలలుగా సిద్ధార్థ రెడ్డి ఏమయ్యారని శబరి ప్రశ్నించారు. కార్యకర్తల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి మళ్లీ రావాలని జగన్ రావాలనుకుంటున్నారా అంటూ సిద్ధార్థ రెడ్డిని ప్రశ్నించారు. సిద్ధార్థ రెడ్డి స్క్రిప్ట్ బాగా చదువుతారని.. సినిమాల్లో ట్రై చేసుకుంటే బెటర్ అని సూచించారు బైరెడ్డి శబరి. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి బయటకు వస్తుందని.. శిక్ష తప్పదని హెచ్చరించారు.