https://oktelugu.com/

సంచలనం: కాపుల కోసం ముద్రగడ మరో కొత్త రాజకీయ పార్టీ

ఎప్పుడు చూసినా తెలంగాణ రాజకీయాలకంటే ఏపీ రాజకీయాలు వేగంగా మారుతుంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్‌ కూడా ఎప్పుడూ ఏపీ రాజకీయాల పైనే ఉంటుంది. అక్కడ ప్రధానంగా కులాలను బేస్‌ చేసుకొని రాజకీయాలు నడుస్తుంటాయనేది బహిరంగ రహస్యం. ఇందుకు తగ్గట్టుగానే అక్కడి నాయకుల వ్యూహాలు అమలవుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో మరో విషయం ప్రచారంలోకి వచ్చింది. Also Read: ఈ సీఎంలు పప్పులో కాలేస్తున్నారా..? : పరిణామాలు అలానే ఉన్నాయి మరి కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 22, 2021 / 12:46 PM IST
    Follow us on


    ఎప్పుడు చూసినా తెలంగాణ రాజకీయాలకంటే ఏపీ రాజకీయాలు వేగంగా మారుతుంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్‌ కూడా ఎప్పుడూ ఏపీ రాజకీయాల పైనే ఉంటుంది. అక్కడ ప్రధానంగా కులాలను బేస్‌ చేసుకొని రాజకీయాలు నడుస్తుంటాయనేది బహిరంగ రహస్యం. ఇందుకు తగ్గట్టుగానే అక్కడి నాయకుల వ్యూహాలు అమలవుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో మరో విషయం ప్రచారంలోకి వచ్చింది.

    Also Read: ఈ సీఎంలు పప్పులో కాలేస్తున్నారా..? : పరిణామాలు అలానే ఉన్నాయి మరి

    కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. మొన్నటివరకు ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం బలంగా నడిచింది. ఆయన ఇంటికి స్వయంగా అప్పటి టీడీపీ బీసీ మంత్రులు, ఇతర బీసీ ఎమ్మెల్యేలు వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేశారు. ఒకానొక సమయంలో కాపు ఉద్యమం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఆ సమయంలోనే ముద్రగడపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఉద్యమ నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం ముద్రగడ వైసీపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. ఇక ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్రగడను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు పార్టీలో కీలక బాధ్యతలు కూడా అప్పగిస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. అయితే తన నిర్ణయం ఏంటనేది మాత్రం ముద్రగడ చెప్పకుండా దాటవేశారు.

    Also Read: నందమూరి బాలక్రిష్ణ గాలితీసిన మంత్రి కొడాలి నాని

    అయితే.. తాజాగా వినిపిస్తున్న ప్రచారం ఏంటంటే.. బీసీలంతా కలిసి ముద్రగడ నేతృత్వంలో ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నారట. ఈ మేరకు ఉద్యమనేత ముద్రగడతో బీసీ నేతలంతా సమావేశమయ్యారు. అంటే ఈ లెక్కన.. కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కులప్రాతిపదికన మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఇప్పటికే టీడీపీ అంటే బీసీల పార్టీగా ముద్రపడిన చాలామంది అది కమ్మ సామాజిక పార్టీగానే గుర్తిస్తారు. తాజాగా బీసీ సంఘాల నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కలిశారు. కొన్ని గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టేందుకు ముందు అన్ని జిల్లాల బీసీ నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించాలని సూచించారట. వారిలో ఎంతమంది కొత్త పార్టీకి మద్దతుగా నిలిచి కలిసి వస్తారో ముందుగా తెలుసుకోమని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత అడుగులు ముందుకు వేయాలని ముద్రగడ సూచించినట్లు తెలుస్తోంది.

    ఏపీలో బీసీలు 52 శాతం.. కాపులు 35 శాతం మంది ఉన్నారు. బీసీలు, కాపులు ఒకే రాజకీయ వేదికపైకి వస్తే అధికారం చేజిక్కించుకోవడం సాధ్యపడుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ముద్రగడ పద్మనాభంకు వివరించిన బీసీ సంఘాల నాయకులు.. ముద్రగడ మద్దతును కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్