https://oktelugu.com/

వంశపారంపర్యంగా కేన్సర్ వస్తుందా.. వాస్తవమేమిటంటే..?

ఈ మధ్య కాలంలో కేన్సర్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేన్సర్ కు చికిత్స తీసుకున్నా కొన్ని సందర్భాల్లో మృతి చెందే అవకాశాలు ఉంటాయి. చాలామందికి కేన్సర్ ఎలా సోకిందనే సందేహం కూడా వేధిస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కేన్సర్ బారిన పడుతూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేన్సర్ కు సంబంధించిన కచ్చితమైన కారణాలను మాత్రం కనుగొనలేకపోయారు. Also Read: కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..? కేన్సర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 22, 2021 / 12:40 PM IST
    Follow us on

    ఈ మధ్య కాలంలో కేన్సర్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేన్సర్ కు చికిత్స తీసుకున్నా కొన్ని సందర్భాల్లో మృతి చెందే అవకాశాలు ఉంటాయి. చాలామందికి కేన్సర్ ఎలా సోకిందనే సందేహం కూడా వేధిస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కేన్సర్ బారిన పడుతూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేన్సర్ కు సంబంధించిన కచ్చితమైన కారణాలను మాత్రం కనుగొనలేకపోయారు.

    Also Read: కరోనా వైరస్ కొత్త లక్షణం… కంటిచూపుకే ప్రమాదం..?

    కేన్సర్ కు కచ్చితమైన కారణం చెప్పడం కష్టమని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చెడు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు, మానసిక సమస్యలు, జీన్స్, హార్మోన్లు పెరగడం వల్ల కేన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. పొగాకు ఉత్పత్తులు, రబ్బరు, యాస్‌బెస్టాస్ కంపెనీలతో కలిసి పని చేసినా, రేడియేషన్‌ కు గురైనా కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది. కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా చెక్ పెట్టవచ్చు.

    Also Read: లక్షలు ఖర్చు చేసి ఎత్తు పెరిగిన యువకుడు.. ఎలా అంటే..?

    మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడితే వారి కుటుంబాలు కూడా కేన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. బి.ఆర్‌.సి.ఎ1, బి.ఆర్‌.సి.ఎ2, జీన్ మ్యుటేషన్ పరీక్షల ద్వారా కూడా కేన్సర్ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే కేన్సర్ బారిన పడినట్టు భావించాల్సి ఉంటుంది. బయాప్సీ చేయించడం ద్వారా రొమ్ములను తొలగించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    అల్ట్రా సౌండ్, మామోగ్రఫీ ద్వారా కూడా చికిత్స చేయించడం ద్వారా కేన్సర్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కేన్సర్ ను కలిగించే వైరస్ లు ఒకరి నుంచి మరొకరికి సోకినా కేన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. రక్త మార్పిడి లేదా లైంగిక సంపర్కం ద్వారా కేన్సర్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటాయి.