MP Vijayasai Reddy: విజయ్ సాయి.. హీరోల రెమ్యూనరేషన్లు నీకెందుకయ్యా?

ఏపీలో ఎన్నో సమస్యలు ఉండగా వాటన్నింటినీ మరిచి కేవలం సినిమాటోగ్రఫీ చట్టాన్ని మార్చాలని విజయ్ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.

Written By: Dharma, Updated On : July 28, 2023 10:42 am

MP Vijayasai Reddy

Follow us on

MP Vijayasai Reddy: వైసిపి నేతలను పవన్ ఒక నీడలా వెంటాడుతూనే ఉన్నారు. వారికి పగలూ రాత్రి పవనే కనిపిస్తున్నారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగం చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది. హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా అంటూ విజయ్ సాయి అడిగిన తీరును చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించేనని అనుమానిస్తున్నారు.

ఏపీలో ఎన్నో సమస్యలు ఉండగా వాటన్నింటినీ మరిచి కేవలం సినిమాటోగ్రఫీ చట్టాన్ని మార్చాలని విజయ్ సాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ సమస్యలు ప్రస్తావించాలని పార్లమెంటుకు పంపిస్తే అడ్డగోలుగా, సంబంధం లేని అంశాలను చర్చకి పెడుతున్నారు. ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న సందర్భమే లేదు. ఏదైనా అంటే బిజెపికి సంపూర్ణ మద్దతు ప్రకటించి చేతులెత్తేసి వెనక్కి వస్తున్నారు.అసలు ఏపీ ప్రజల బాధలేమిటి? వాటికి పరిష్కారం ఎలా చూపుతారు? అన్న ప్రశ్నలే వేయడం లేదు.

విజయ్ సాయి రెడ్డి మనసులో పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నారు. కానీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తావించారు. ఆయనకు 200 కోట్ల రూపాయలు అవసరమా అని ప్రశ్నించారు. హీరోలు అంత రెమ్యూనరేషన్ తీసుకోవడంతో మిగతా యూనిట్ సభ్యులకు అన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. బడ్జెట్లో సింహభాగం హీరోలకు వెళ్లే సంస్కృతి మారాలని కోరారు. హీరోల కొడుకులే హీరోలుగా ఎందుకు అవుతున్నారని ప్రశ్నించారు. మొత్తం సినిమాటోగ్రాఫీ చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.

ఇలా వైసిపి నేతలు పనికిమాలిన విషయాలకే ప్రాధాన్యత ఇస్తుండడం ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నీలి,కూలి, అనుకూల సోషల్ మీడియాలు మాత్రం పెద్ద పెద్ద ఎలివేషన్ వేసుకుంటున్నాయి. అదేదో లోక కళ్యాణార్థం వైసీపీ సభ్యులు ప్రశ్నలు పరంపర కొనసాగిస్తున్నారని పతాక శీర్షికన కథనాలు వండి వార్చుతున్నాయి. హీరోల కొడుకే హీరోలు ఎందుకు అవుతున్నారు అని ప్రశ్నిస్తున్న విజయ్ సాయి రెడ్డి ని నేటిజెన్లు నిలదీస్తున్నారు. సీఎం కుమారుడు సీఎం కాకా లేనిది.. హీరోలు అవుతుండడం తప్ప అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ ఎంపీలు పనికిమాలిన విషయాలతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి.