Vasireddy Padma: వైసీపీలో పదవులకు బూతులే కొలమానమా?

వైసీపీలో పదవులు దక్కాలంటే బూతులు మాట్లాడాల్సిందేనని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Written By: Dharma, Updated On : July 28, 2023 9:21 am

Vasireddy Padma

Follow us on

Vasireddy Padma: ఎక్కడైనా పని,పనితీరు కొలమానం అంటారు. కానీ వైసీపీలో మాత్రం బూతులు మాట్లాడే వారికి పదవులు, పదోన్నతులు. వీటి ద్వారా అధినేత ప్రాపకాన్ని పొందిన నేతలు ఇట్టే పదవులు పొందెసారు. ఈ చిన్న సూత్రాన్ని గమనించిన చాలామంది నాయకులు ఓవర్ నైట్ లో కీలక కొలువులు దక్కించుకున్నారు. వైసీపీలో పదవి దక్కాలంటే కచ్చితంగా ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించాలి. ఈ క్రమంలో బూతు పదాలను కూడా వాడితేనే గుర్తింపు.

అయితే ఈ అవసరం తాజాగా వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మకు వచ్చింది. ప్రస్తుతం ఆమెకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి ఉందో లేదో తెలియదు. ప్రభుత్వము స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఆమె హైరానా పడుతున్నారు. దీంతో వైసిపి మార్కు బూతు లాంగ్వేజ్ ను అందుకున్నారు. పవన్ కళ్యాణ్ పైనే ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ ఎదురుగా కనిపిస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ ది క్రిమినల్ కహాని అని.. ప్రభుత్వాన్ని పలుచన చేయాలన్న ఉద్దేశం కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

అయితే మహిళా చైర్పర్సన్ హోదాలో ఉన్నట్టు చెబుతున్న వాసిరెడ్డి పద్మ… పవన్ పై వ్యక్తిగత దాడికి దిగారు. అసలు సిసలైన వైసీపీ మార్కు పదజాలాలను వాడారు. వాడు, వీడు అంటూ రెచ్చిపోయారు. మూడు పెళ్లిళ్లు గురించి ప్రస్తావించారు. ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. కడుపు అయినా చేయాలి అంటాడు అంటూ పూనకం వచ్చినట్టు మాట్లాడారు. చివరిగా మహిళా కమిషన్ పై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారంటూ పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీలో పదవులు దక్కాలంటే బూతులు మాట్లాడాల్సిందేనని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పవన్ తిట్టించేందుకు మహిళా నేతలను ప్రయోగిస్తుండడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు . దీని ద్వారా వైసిపి నాయకత్వం రాక్షసానందం పొందుతుంది తప్ప.. తరువాత సదరు మహిళా నేతలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.