Anju Nasrullah: సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన ఓ పాకిస్థాన్ వ్యక్తితో ఓ వివాహిత ప్రేమాయాణం నడిపింది. అతడి కోసం ఏకంగా భర్తను, కన్న పిల్లలను వదిలేసి పాకిస్థాన్ వెళ్లిపోయింది. అంతే కాదు మతం మార్చుకుంది. అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజు అనే 35 మహిళకు భర్త, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు 15 ఏళ్లు, కుమారుడికి 6 ఏళ్ల వయసు ఉంటుంది. చిన్నతనంలోనే పెళ్లయినప్పటికీ అంజుకు టెక్నాలజీ మీద పట్టు ఎక్కువ. భర్త కూడా ఆమె ఆసక్తిని గమనించి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. అయితే ఇది తన కొంప ముంచుతుందని ఊహించి ఉండడు. ఆ ఫోన్ ద్వారా ఆమె సోషల్ మీడియాను వాడేది. అందులో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. వెంటనే దేశం వదిలి పారిపోయింది. భర్త, కూతురు, కుమారుడిని కూడా వదిలి వెళ్లిపోయింది. అక్కడిక వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు మార్చుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
పాకిస్థాన్ వెళ్లిన ఫాతిమా అలియాస్ అంజు అతడి భర్త నస్రుల్లాకు బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంటకు స్థానికంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందించాడు. డబ్బు, ఉండటానికి ఇల్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలు సమకూర్చుతున్నాడు. పాక్ కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెపై ప్రశంసలు జల్లులు కురుస్తున్నాయి. ఈవ్యవహారంపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఫాతిమాగా అంజూ మారడం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. పాక్ కు వెళ్లిన భారత వివాహితకు బహుమతుల పేరిట అక్కడి స్థిరాస్తి వ్యాపారులు సకల సౌకర్యాలు సమకూర్చడం కుట్రకు తావిస్తోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, అంజు ఇల్లు వదిలి పారపోవడం పట్ల ఆమె తండ్రి కన్నీటి పర్యంతమవుతన్నారు. భర్తను, పిల్లలను ఆమె వదిలి వెళ్లడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చనిపోయినట్టు భావిస్తున్నట్టు ప్రకటించారు.