ఎంటర్టైన్మెంట్Producer Shobu Yarlagadda- Vishwak Sen: విశ్వక్ సేన్ ని గెలికిన బాహుబలి నిర్మాత..? తలపొగరు...

Producer Shobu Yarlagadda- Vishwak Sen: విశ్వక్ సేన్ ని గెలికిన బాహుబలి నిర్మాత..? తలపొగరు ఉంటే కుదరదంటూ!

Producer Shobu Yarlagadda- Vishwak Sen: బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కొత్త వివాదానికి తెరలేపారు. ఆయన వేసిన ఒక ట్వీట్ హీరో విశ్వక్ సేన్ ని ఉద్దేశించే అనే చర్చ నడుస్తుంది. ఇటీవల బేబీ చిత్ర డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వక్ సేన్ మధ్య సోషల్ మీడియా వార్ నడిచింది. బేబీ చిత్ర కథను వినడానికి కూడా ఒక హీరో ఇష్టపడలేదు. ఆ డైరెక్టర్ అయితే స్క్రిప్ట్ వినడం కూడా వేస్ట్ అని నన్ను కలవలేదని సాయి రాజేష్ ఆరోపణ చెప్పాడు. ఆ హీరో ఎవరనేది సాయి రాజేష్ చెప్పలేదు. సాయి రాజేష్ ఈ కామెంట్స్ చేశాక విశ్వక్ సేన్ ఒక అనుమాస్పద ట్వీట్ చేశాడు.

నో మీన్స్ నో… ఇది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది. మనం ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నాము. గొడవ చేయకుండా గమ్మున ఉండండి, అని ట్వీట్ చేశాడు. ఇది సాయి రాజేష్ మాటలకు విశ్వక్ సేన్ కౌంటర్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సాయి రాజేష్ చెప్పిన హీరో విశ్వక్ సేనే అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. విశ్వక్ ట్వీట్స్ కి సాయి రాజేష్ కూడా కౌంటర్ ట్వీట్స్ వేశాడు.

సడన్ గా సీన్లోకి శోభు యార్లగడ్డ వచ్చాడు. నిన్న ఆయన ‘ఇప్పుడే ఎదుగుతున్న హీరో తన యాటిట్యూడ్ తో ఒక హిట్ కొట్టాడు. సక్సెస్ తలపొగరు తెస్తుంది. కానీ దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒక దర్శకుడు స్క్రిప్ట్ చెబుతానంటే కనీసం వినకుండా అవమానించడం ఎంత వరకు కరెక్ట్. కెరీర్లో ఎదగాలంటే ఇలాంటి యాటిట్యూడ్ వదులుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటాడో’ అని ట్వీట్ చేశాడు.

ఇక శోభు యార్లగడ్డ ప్రస్తావించిన హీరో విశ్వక్ సేన్ అని నెటిజెన్స్ నిర్దారించారు. అనూహ్యంగా సదరు ట్వీట్ ని శోభు యార్లగడ్డ డిలీట్ చేశాడు. అలాగే విశ్వక్ సేన్ కాదంటూ కామెంట్ చేశాడు. ఆయన ఎన్ని చెప్పినా… జనాలు నమ్మడం లేదు. విశ్వక్ సేన్ నే శోభు యార్లగడ్డ టార్గెట్ చేశాడనే చర్చ మొదలైంది. వివాదాలకు దూరంగా ఉండే శోభు యార్లగడ్డ ఒక చిన్న హీరో, డైరెక్టర్ వివాదంలో ఎందుకు తలదూర్చాడో అర్థం కావడం లేదు.

సాయి రాజేష్-విశ్వక్ సేన్ వివాదం సద్దుమణిగింది. అనవసరంగా ఇప్పుడు శోభు యార్లగడ్డ గెలికాడు. కాగా విశ్వక్ పలుమార్లు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. ఫలక్ నుమా దాస్ మూవీ విడుదలకు ముందు నానా రచ్చ చేశాడు. తన మూవీ పోస్టర్స్ చించేశారని దాని వెనుక హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడని ఆరోపించాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రమోషన్స్ కో పబ్లిక్ లో న్యూసెన్స్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా బేబీ చిత్ర వివాదం ఆయన్ని చుట్టుముట్టింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Nani: నాని, విశ్వక్ సేన్ సినిమాలను రిజెక్ట్ చేసిన నాగ దుర్గ… కారణమేంటంటే..?

Nani: సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది పాపులారిటిని సంపాదించుకుంటున్నారు. ఇక యూట్యూబ్ లో ఫోక్ డాన్సర్ గా అదరగొట్టిన నాగ దుర్గ సైతం ప్రస్తుతం హీరోయిన్ గా అవతరించింది. ఇప్పటికే...

Ee Nagaraniki Emaindi 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. వైరల్ అవుతున్న ప్రోమో..

Ee Nagaraniki Emaindi 2: యూత్ ఆడియన్స్ కి బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి 'ఈ నగరానికి ఏమైంది'. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో పెద్దగా ఆడలేదు...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version