CM Jagan- AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులను ఎన్నో రకాలుగా వేధించినా చివరకు మాత్రం వారికి గుడ్ న్యూస్ చెప్పడం తెలిసిందే. ఇన్నాళ్లు ఉద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వారిని దారికి తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి ఈ కానుకలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వారి అవసరం ఉంటుంది కాబట్టే వారిని తగిన విధంగా ఆదరించాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఎంప్లాయిస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములో ఇప్పటి వరకు లేని 565 జబ్బులను చేర్చింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో కూడా వారు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. దీంతో వారికి మనో ధైర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆరోగ్య శ్రీ పథకంలో వలే ఉద్యోగులు చికిత్స చేయించుకున్న 21 రోజుల్లోనే బిల్లులు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులు తమకు వచ్చే జబ్బులకు భయపడాల్సింది లేదని చెబుతోంది. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: MP Gorantla Madhav Video Issue: మాధవ్ వీడియోతో టీడీపీ లాభపడుతోందా?
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో ఉండే ఆరోగ్య మిత్రలకు కూడా ఆదేశాలు జారీ చేస్తామని చెబుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం జబ్బులకు చికిత్స చేసి తరువాత బిల్లులు తీసుకునేలా వెసులుబాటు కల్పించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉద్యోగ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది. తమ ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఇక జబ్బుల బారిన పడితే తక్షణమే చికిత్సలు చేయించుకుని తీరుతామని చెబుతున్నారు.

సీఎం జగన్ ఉద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయంతో అందరు హర్షిస్తున్నారు. సర్కారు తీసుకొచ్చిన నిర్ణయంతో జబ్బుల బారిన పడినా భయపడకుండా తగిన వైద్యం చేయించుకుని కుటుంబ సభ్యులకు సంతోషంగా నిలుస్తామని చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా తమ కుటుంబ సభ్యులను ఇతర రాష్ట్రాల్లో కూడా చికిత్సలు చేయించుకునే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో చాలామందికి ప్రయోజనం దక్కనుందని తెలుస్తోంది.
Also Read:Vijay Devarakonda: ఆమెకు అలాంటివి నచ్చవట.. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేసేది ఆ స్టార్ హీరోయిన్ యేనా?
[…] […]