సింథియాపై పాత కేసు తిరగేస్తున్న ఎంపీ ప్రభుత్వం

రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో సంబంధాన్ని తెంచుకొని బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు తెరలేపింది. ఆయన బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే ఆయనకు మధ్యప్రదేశ్ ఎకనామిక్ నేరాల విభాగం గట్టి షాకిచ్చింది. ఆరేళ్ల క్రితం ఆయనపై నమోదైన ఫోర్జరీ కేసును రీఓపేన్ చేస్తున్నట్లు ఎకానమిక్ వింగ్ తెలిపింది. సింధియా బీజేపీలో చేరిన రెండు రోజులకే ఈ కేసును తిరిగితోడడంపై రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 4:49 pm
Follow us on

రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో సంబంధాన్ని తెంచుకొని బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు తెరలేపింది. ఆయన బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే ఆయనకు మధ్యప్రదేశ్ ఎకనామిక్ నేరాల విభాగం గట్టి షాకిచ్చింది.

ఆరేళ్ల క్రితం ఆయనపై నమోదైన ఫోర్జరీ కేసును రీఓపేన్ చేస్తున్నట్లు ఎకానమిక్ వింగ్ తెలిపింది. సింధియా బీజేపీలో చేరిన రెండు రోజులకే ఈ కేసును తిరిగితోడడంపై రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలను ధృవీకరించడం కోసం వారిపై కొత్తగా విచారణను ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం నిర్ణయించింది. రూ 10,000 కోట్ల విలువైన భూమిని విక్రయించేటప్పుడు సింధియా తప్పుడు ఆస్తి పత్రాన్ని ఇచ్చాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.