MP Avinash Reddy: సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోబోతుందా.. అసలేం జరుగుతుంది!

MP Avinash Reddy:  ఏపీ లో వివేకా నంద రెడ్డి హత్య కేసు ఎన్ని మలుపులు తిరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా వివేకా నంద రెడ్డి హత్య కేసు మరొక మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో ఒకరిని సిబిఐ అదుపులోకి తీసుకో బోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో సీబీఐ ముందస్తుగా అన్ని సన్నాహాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో ఈ అంశం మీద ఇదొక యాక్షన్ […]

Written By: Mallesh, Updated On : December 22, 2021 7:49 pm
Follow us on

MP Avinash Reddy:  ఏపీ లో వివేకా నంద రెడ్డి హత్య కేసు ఎన్ని మలుపులు తిరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా వివేకా నంద రెడ్డి హత్య కేసు మరొక మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో ఒకరిని సిబిఐ అదుపులోకి తీసుకో బోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో సీబీఐ ముందస్తుగా అన్ని సన్నాహాలు చేసుకున్నట్టు తెలుస్తుంది.

MP Avinash Reddy

రెండు, మూడు రోజుల్లో ఈ అంశం మీద ఇదొక యాక్షన్ తీసుకో బోతున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇంతకీ వివేకా నంద రెడ్డి హత్య కేసులో ఎవరిని సీబీఐ అదుపులోకి తీసుకోబోతుంది అంటే.. వివేకా నంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపు లోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ ఈ విషయంపై పర్మిషన్స్ కూడా తీసుకుందని టాక్.

అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో స్పీఎకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.. ఈ క్రమంలో ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐ కి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని ఢీల్లీ లో ఈ విషయం జోరుగా ప్రచారం జరుగుతుంది. రెండు, మూడు రోజుల్లోనే ఈయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తాజా సమాచారం.

Also Read: AP Govt: ఏపీలో సర్కారు ఆశయం సన్నగిళ్లుతోందా? .. హెల్త్ హబ్స్ నిర్మాణాలకు ముందుకు రాని టెండర్లు?

అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు కూడా ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు.. ఇప్పటికే అవినాష్ రెడ్డి అనుచరుడు అయినా శివశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో ఈ కేసులో ఒక్కసారిగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేసును ముందుకు తీసుకు వెళ్లనివ్వకుండా ఒత్తిడి చేస్తున్నారని కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీంతో సీబీఐ అధికారులు కొద్దీ రోజులు ఢిల్లీ కి వెళ్లి తిరిగి వచ్చి ఇప్పుడు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో..

Also Read: Exhibitors: ప్రభుత్వంతో ‘ఫైట్’కు సిద్ధమవుతున్న సినీ ఎగ్జిబిటర్లు..!

Tags