గవర్నర్ ఆదేశాలు బేఖాతర్… ఎంపీ అసెంబ్లీ వాయిదా!

సభలో మెజారిటీ కోల్పోయిన కమల్‌నాథ్ ప్రభుత్వంపై వెంటనే బలపరీక్ష జరపాలని గవర్నర్ లాల్జీ టాండన్ జారీచేసిన ఆదేశాలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి బేతఖార్ చేశారు. కరోనా వైరస్ సాకుతో సమావేశాలను ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. దానితో కమల్‌నాథ్ ప్రభుత్వానికి మరో పదో రోజులపాటు వెసులుబాటు కలిగిన్నట్లు అయింది.      ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా […]

Written By: Neelambaram, Updated On : March 16, 2020 5:27 pm
Follow us on

సభలో మెజారిటీ కోల్పోయిన కమల్‌నాథ్ ప్రభుత్వంపై వెంటనే బలపరీక్ష జరపాలని గవర్నర్ లాల్జీ టాండన్ జారీచేసిన ఆదేశాలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి బేతఖార్ చేశారు. కరోనా వైరస్ సాకుతో సమావేశాలను ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. దానితో కమల్‌నాథ్ ప్రభుత్వానికి మరో పదో రోజులపాటు వెసులుబాటు కలిగిన్నట్లు అయింది. 
 
  ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.  దీనిపై బిజెపి నాయకులు శనివారం గవర్నర్ ను కలసి వెంటనే బలపరీక్ష జరుపుకోవాలని ముఖ్యమంత్రిని ఆదేశింమని కోరారు.
 
దానితో, సోమవారం నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అతన ప్రసంగం పూర్తి కాగానే, మరే అంశాన్ని చేపట్టకుండా బలపరీక్ష జరపాలని స్పీకర్ ప్రజాపతి గవర్నర్ ఆదేశించారు. అయితే గవర్నర్ ప్రసంగం కాకూంసా ఆ 
అంశాన్ని చేపట్టకుండానే మధ్య ప్రదేశ్ స్పీకర్ ప్రజాపతి సమావేశాలను ఈ నెల 26 వరకు వాయిదా వేశారు.
 
కరోనా వైరస్‌పై  భయాందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజున రాజ్యసభ ఎన్నికలు ఉండడం గమనార్హం.
 
అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో భాగంగా గవర్నర్ టాండన్ మాట్లాడుతూ.. ‘‘మధ్య ప్రదేశ్ ప్రతిష్టను కాపాడేందుకు అందరూ రాజ్యాంగాన్ని అనుసరించాలి’’ అని పేర్కొనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నినాదాలు చేశారు. 
 
మరోవంక, అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దనీ… స్పీకర్ నిర్ణయాలను గౌరవించాలంటూ ఇవాళ ఉదయం గవర్నర్‌కు ముఖ్యమంత్రి కమల్ నాధ్ లేఖ వ్రాసారు. బిజెపి వారి కట్టడిలో ఉన్న 22 మంది కాంగ్రెస్ ఎమ్యెలు తిరిగి వచ్చే వరకు బలపరీక్ష జరపడం సమంజసం కాదని కూడా స్పష్టం చేశారు. 
 
కాగా, శిబిరాలకు తరలించిన తమ పార్టీ ఎమ్యెల్యేలను బిజెపి నాయకులు మూడు ప్రత్యేక బస్సులలో అసెంబ్లీ సమావేశాలకు తీసుకు వచ్చారు.