ఇదో పెద్ద జోకు: మోడీకే మళ్లీ కావాలట?

దేశ ప్రధానిగా మళ్లీ మోడీనే కావాలట.. ఇందుకు దేశంలోని 66శాతం మంది ప్రజలు ఓటేశారట.. కేవలం 8శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నేత రాహుల్ ప్రధాని కావాలని అభిప్రాయపడ్డారట.. ఇదంతా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ జాతీయ మీడియా చానెల్ నిర్వహించిన సర్వే ఫలితాలు. తాజాగా విడుదలైన ఈ సర్వే రిపోర్ట్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్? ఇంతటి కరోనా కాలంలో […]

Written By: NARESH, Updated On : August 8, 2020 4:46 pm
Follow us on

దేశ ప్రధానిగా మళ్లీ మోడీనే కావాలట.. ఇందుకు దేశంలోని 66శాతం మంది ప్రజలు ఓటేశారట.. కేవలం 8శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నేత రాహుల్ ప్రధాని కావాలని అభిప్రాయపడ్డారట.. ఇదంతా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ‘ఇండియా టుడే’ జాతీయ మీడియా చానెల్ నిర్వహించిన సర్వే ఫలితాలు. తాజాగా విడుదలైన ఈ సర్వే రిపోర్ట్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read: ఏపీ మూడు రాజధానులపై తెలంగాణ సీఎం ఫోకస్?

ఇంతటి కరోనా కాలంలో పైసా విదిల్చని ప్రధాని మోడీ సార్ పై దేశప్రజల్లో పీకల్లోతూ కోపం ఉంది. అమెరికా, జపాన్, యూరప్ దేశాలన్నీ కరోనా టైంలో ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసి ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాయి. కానీ మన మోడీసార్ ‘20లక్షల కోట్ల ప్యాకేజీ’ అంటూ సినిమా చూపించేశారు. అన్ని లక్షల కోట్లు ఎటుపోయాయో.. దేనికి ఖర్చు చేశారో ఇప్పటికీ మిస్టరీనే..మోడీ పాలసీలంతా కార్పొరేట్లకు దోచిపెట్టడమే తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని ఆర్థికవేత్తలే విమర్శిస్తున్న పరిస్థితి దేశంలో ఉంది.

దేశంలో ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధి కోల్పోయి కోట్ల మంది రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు వలస కూలీలు.. వీధి వ్యాపారులు, ప్రజలంతా ఆదాయం లేక అరిగోస పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ఏమాత్రం చొరవ చూపని మోడీపై దేశప్రజల్లో పీకలదాకా కోపం ఉంది.

ఇక కరోనా దెబ్బకు నిరుద్యోగం బాగా ప్రబలింది. దేశంలో ఇప్పుడు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం చోద్యం చూస్తోంది. దేశంలో ఉన్న ప్రజలను పనుల కోసం అల్లాడి పోతున్నారు. రాష్ట్రాలకు డబ్బులు సరిగా కేంద్రం ఇవ్వడం లేదు. చైనా సరిహద్దుల్లో ఘర్షణలకు కారణాలను కేంద్రం దాచిపెడుతోంది. అయోధ్య రామాలయ భూమి పూజ తన సొంత కార్యక్రమం అనుకొని ఎవరిని పిలవకుండా యోగిలను భోగిలను సన్యాసులను పిలిచి క్రెడిట్ కోసం తన ఖాతాలో వేసుకుంది. కరోనా కరువు వేళ మనోభావాల ఆధ్యాత్మిక రాజకీయం చేస్తోంది.

Also Read: బాబు ప్రెస్ మీటా..? టీడీపీ నేతల పరుగో పరుగు?

2019 ఎన్నికల్లో గెలిచాక మోడీ చేసిన పనుల వల్ల లబ్ధి పొందిన వారు చాలా తక్కువ. కరోనా టైంలో ఫెయిల్యూర్.. చైనాతో ఘర్షణల్లో మతలబులు అన్నింటిలోనూ మోడీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరింత ఇంత ఘోరమైన వైఫల్యం చవిచూపించిన మోడీకి ఏకంగా దేశంలో 66శాతం మద్దతు వచ్చిందంటే నమ్మశక్యంగా లేదని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఇండియా టుడే ముమ్మాటికి ఫేక్ సర్వే అని చదువుకున్న వారు.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది పడిపోతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన ఫేక్ సర్వే అంటూ ఆడిపోసుకుంటున్నారు.