తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ తరువాత బీజేపీలో చేరారు. అయితే అక్కడి పరిస్థితులు నచ్చకపోవడంతో పాటు, కేసీఆర్ పథకాలకు ఆకర్షితుడయ్యానని చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన టీడీపీ, బీజేపీలో ఉన్నంత కాలం కేసీఆర్ పై తిట్ల దండకం చేశారు. కానీ గత కొద్ది కాలంగా ఆయన కేసీఆర్ ను మెచ్చుకోవడంతో త్వరలో ఆయన టీఆర్ఎస్లో చేరుతారని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఆయన గులాబీ కండువా కప్పుకోలేదు. తాజాగా ఆయన కారు పార్టీలోకి వెళ్లే సమయం వచ్చిందని అనుకుంటున్నారు. అయితే మోత్కుపల్లి నర్సింహులకు ఏం ఆఫర్ ఇచ్చారు..? ఏ పదవి కోసం ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారు..?

మాజీ మంత్రి మోత్కులపల్లి నర్సింహులు గత కొద్ది కాలంటా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన ఆ పార్టీలో లేరు. సమయం చూసి గులాబీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారు. అయితే ఇదే సరైన సమయం అని అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి మోత్కుపల్లిని చైర్మన్ చేస్తారని అంటున్నారు. కానీ ఆ విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తనకే ఈ పదవి వస్తుందని మోత్కుపల్లి అనుచరుులు సైతం అనుకుంటున్నట్లు సమాచారం.
విమర్శలు చేయడంలో మోత్కుపల్లి నర్సింహులది ప్రత్యేకత ఉంటుంది. అయన టీడీపీ, బీజేపీలో ఉన్నంతకాలం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ను టార్గెట్ చేసి ఘాటు విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో ఇప్పుడు పోస్టు చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని కొందరు అంటున్నా.. మోత్కుపల్లి మాత్రం తనకు న్యాయం చేయకపోతే ఊరుకోరని తెలుస్తోంది. టీడీపీలో ఆయన మంచి పదవులు పొందినా.. బీజేపీలో ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే ఆయన ఆ పార్టీని వీడినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చినా న్యాయం జరగకపోతే మళ్లీ ఆయన ఎదురుతిరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత మిషన్లో మోత్కుపల్లికి అవకాశం ఇస్తారా..? లేదా..? అని చర్చించుకుంటున్నా.. ఆయన సేవలను మాత్రం కేసీఆర్ ఉపయోగించుకుంటాని అంటున్నారు. ఆయనను చేర్చుకుంటే దళిత ఓట్లు కలిసి వస్తాయని అంటున్నారు. అందుకనే కేసీఆర్ తనను ఎంత తిట్టినా మోత్కుపల్లి చేరికను ఆయన వ్యతిరేకించడం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లోపు మోత్కుపల్లికి ఏ పదవి లేకపోయినా ఆ తరువాత హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటాని అంటున్నారు. అయితే అందుకు మోత్కుపల్లి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.