https://oktelugu.com/

Singer Gaddar in “God Father”: చిరంజీవి ప్లాష్ బ్యాక్ కోసం గద్దర్ పాట !

Singer Gaddar in “God Father”: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు దర్శక, నిర్మాతలు గద్దర్‌ ని సంప్రదించారు. అయితే, ఈ సినిమాలో హీరో పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఒక పాట పాడాల్సి ఉంది. ఆ పాటను గద్దర్ చేత […]

Written By:
  • admin
  • , Updated On : August 29, 2021 / 05:56 PM IST
    Follow us on

    Singer Gaddar in “God Father”: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మేరకు దర్శక, నిర్మాతలు గద్దర్‌ ని సంప్రదించారు. అయితే, ఈ సినిమాలో హీరో పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఒక పాట పాడాల్సి ఉంది. ఆ పాటను గద్దర్ చేత పాడిస్తే బాగుంటుంది అని మేకర్స్ ఫీల్ అయ్యారు.

    కాగా, గద్దర్ కూడా గాడ్ ఫాదర్ సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇక వచ్చే నెల ఫస్ట్ వీక్ లో జరగనున్న షెడ్యూల్‌ లో గద్దర్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరగనుంది. అన్నట్టు ఈ షూట్ ను వైజాగ్ జైలులో చిత్రీకరించేలా దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి గద్దర్‌ సన్నివేశాలు చాలా బాగుంటాయట.

    ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్రలో నటించడానికి అంగీకరించాడు. పైగా ఇప్పటికే సల్మాన్‌ ఖాన్ ఈ సినిమా కోసం తన డెట్స్‌ కూడా ఇచ్చాడు. వచ్చే చివరి వారంలో సల్మాన్ పాత్ర తాలూకు సీన్స్ ను షూట్ చేయనున్నారు.

    ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న పృథ్విరాజ్ సుకుమార‌న్ పాత్ర‌నే తెలుగు వెర్షన్ లో స‌ల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. అంటే.. సల్మాన్ ఖాన్ ది ఈ సినిమాలో అతిథి పాత్ర మాత్రమే. అయినా నటించేది సల్మాన్ ఖాన్ కాబట్టి.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఏది ఏమైనా మెగాస్టార్ పై ఉన్న అభిమానంతో సల్మాన్ ఈ సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా అనసూయ నటించబోతుంది. అలాగే తమ్ముడు పాత్రలో సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ‘గాడ్ ఫాదర్’ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్ లో ఓ ప్రవేట్ ప్లేస్ లో శరవేగంగా జరుగుతోంది.