Mother’s Day 2025: సృష్టికి రూపం అమ్మ.. అమ్మ లేకపోతే జననం లేదు.. అమ్మ లేకపోతే జీవితం లేదు.. అమ్మ లేకపోతే అసలు బతికే లేదు.. అలాంటి అమ్మను ఎప్పటికీ తలుచుకుంటూ ఉండాలి. కానీ కొన్ని కారణాలవల్ల నేటి కాలంలో తల్లిదండ్రులు దూరమైన పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఇలాంటివారు కనీసం ఒక్కరోజైనా తల్లితో సంతోషంగా గడపాలని అనుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది మే 11వ తేదీన మాతృమూర్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ లో లేదా.. నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలపడానికి అందమైన కొటేషన్స్ కావలసి ఉంటుంది. సాధారణంగా కాకుండా.. మంచి మాటలతో తల్లికి శుభాకాంక్షలు తెలపడం వల్ల ఎంతో సంతృప్తి చెందుతుంది. అయితే అందమైన కొటేషన్స్ మీ కోసం..
Also Read: ట్రంప్ మధ్యవర్తిత్వం సరే.. ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ ఏం తెలుసుకోవాలి?
నీ ఒడిలో ఉంటే ఎంతో హాయి.. నీ నవ్వు చూస్తే నాకు హ్యాపీ… మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ ప్రేమ నా జీవితాన్నే మార్చేసింది.. నీ సపోర్టు నాకు ఎంతో బలం అమ్మా..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
అమ్మ ప్రేమ మీదికి ఏదీ రాదు.. ఆమె దీవెనలు ఎప్పుడూ నాతోనే ఉండాలి..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
మీ మాటలు ఎంతో తీయగా ఉంటాయి.. నీ చూపుల్లో ఎంతో దయ ఉంటుంది..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీవు చేయి పట్టుకున్న క్షణమే నా జీవితం మారిపోయింది అమ్మ..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ ప్రేమ ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి నాకు అమితమైన శక్తి ఉంటుంది అమ్మ..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ ఆలోచనలే నన్ను ముందుకు నడిపిస్తాయి.. నీ నీడ నాకు కాసం లాంటిది..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నువ్వే దైవం.. నువ్వే జీవితం.. నువ్వు లేకుంటే నాకు బ్రతుకు లేదు అమ్మ..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నువ్వు లేకుంటే నేను ఒంటరి వాడిని.. నువ్వు లేకపోతే నాకు గమ్యం లేదు.. దారి చూపే దేవతవు నువ్వే అమ్మ..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
తల్లికి మించిన దైవం లేదు..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ రూపం కనిపించకపోయినా.. నీ పేరు తలుచుకుంటేనే గుండె నిండిపోతుంది అమ్మ..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ దీవెనలు ఎప్పుడూ నా మీదే ఉంటాయి.. ఈ గుర్తుల ఎప్పుడు నాతోనే ఉంటాయి..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
అమ్మలాంటి ఇల్లు మరి ఎక్కడ దొరకదు.. అమ్మే ప్రశాంతమైన ఇల్లు..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ గుండె నిండా ప్రేమే ఉంది.. ఆ ప్రేమే నాకు బలం అమ్మ..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
మీ చేయి పట్టుకుంటే నాకు ధైర్యం ఉంటుంది.. నీతో నడిస్తే నాకు బలం వస్తుంది.. నీవే దైవం అమ్మ .. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
నీ గుర్తులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి.. హ్యాపీ మదర్స్ డే..
సృష్టికి మూలం అమ్మ.. ఒక వ్యక్తి జీవితానికి అమ్మే కారణం.. అలాంటి అమ్మకోసం ఎంత కష్టమైనా భరిస్తాను..మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.